AP: పరవాడ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం-fire accident at paravada pharma city in anakapalle ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap: పరవాడ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

AP: పరవాడ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

HT Telugu Desk HT Telugu
Apr 23, 2022 04:53 PM IST

పరవాడ మండలం జవహర్‌లాల్ ఫార్మా సిటీ ఎస్ఎన్ఎఫ్ ఫార్మాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

<p>పరవాడ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం</p>
పరవాడ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

అనకాపల్లి జిల్లా పరిధిలోని పరవాడ మండలం జవహర్‌లాల్ ఫార్మా సిటీ ఎస్ఎన్ఎఫ్ ఫార్మాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెల్డింగ్ వర్క్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

<p>ప్రమాదం సంభవించిన ప్రాంతంలో దట్టమైన పొగ</p>
ప్రమాదం సంభవించిన ప్రాంతంలో దట్టమైన పొగ

మరోవైపు అగ్నిప్రమాదం దాటికి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అర్పుతున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Whats_app_banner