APSRTC: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై ఆర్టీసీలో మహిళా డ్రైవర్లు! -female drivers in apsrtc buses full details here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Female Drivers In Apsrtc Buses Full Details Here

APSRTC: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై ఆర్టీసీలో మహిళా డ్రైవర్లు!

HT Telugu Desk HT Telugu
Jul 28, 2022 06:56 AM IST

ఏపీలోని ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయనుంది.

ఏపీఆర్టీసీలో మహిళా డ్రైవర్లు
ఏపీఆర్టీసీలో మహిళా డ్రైవర్లు

female drivers in apsrtc: మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై మహిళకు ఆర్టీసీలో డ్రైవర్లుగా అవకాశం కల్పించనుంది. ఆ దిశగా చర్యలు చేపట్టబోతుంది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు రాష్ట్రంలోని ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ మేరకు త్వరలోనే గైడ్ లైన్స్ విడుదల కానున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

అర్హతల ఇలా ఉండే ఛాన్స్….

పదో తరగతి పాసైన వారు ఈ శిక్షణకు అర్హులుగా ఉంటారు. మహిళల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేయనున్నారు. వీరికి ఉమ్మడి జిల్లాల్లోని అందుబాటులో ఉన్న ఆర్టీసీ డ్రైవింగ్‌ స్కూళ్లలో 32 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఆర్టీసీ బస్సుపైనే శిక్షణ ఉంటుంది.. ఈ శిక్షణ ఇచ్చినందుకు ఆర్టీసీకి ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం చెల్లింపులు చేస్తుంది. డ్రైవింగ్‌లో శిక్షణతో పాటు మహిళలకు హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా ఇస్తారు. .

ఇలా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అభ్యర్థులకు ఆర్టీసీలోనే డ్రైవర్‌గా పోస్టింగ్‌ ఇస్తారు. ఈ అభ్యర్థుల్లో అర్హత, నైపుణ్యాన్ని బట్టి తొలి దశలో ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఎస్సీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల్లో నియమించేందుకు ప్రతిపాదించనున్నారు. అర్హుల ఎంపిక కోసం అవసరమైన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే మహిళలు ఆటోలు నడుపుతూ ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వడం ద్వారా భారీ వాహనాలు నడిపే సత్తా వారికి వస్తుందని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. మెరుగైన ప్రతిభ కనబరిస్తే ఆర్టీసీ లాంటి ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు పొందవచ్చని ఎస్సీ కార్పొరేషన్ చెబుతోంది.

IPL_Entry_Point

టాపిక్