AP CEO : ఏపీ సీఈవోగా వివేక్‌ యాదవ్‌ - ఎక్సెజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనా-eci appoints vivek yadav as ceo of andhrapradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ceo : ఏపీ సీఈవోగా వివేక్‌ యాదవ్‌ - ఎక్సెజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనా

AP CEO : ఏపీ సీఈవోగా వివేక్‌ యాదవ్‌ - ఎక్సెజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనా

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 13, 2024 12:11 PM IST

ఏపీ సీఈవోగా సీనియర్ ఐఏఎస్‌ అధికారి వివేక్ యాదవ్‌ నియమించేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం సీఈవోగా ఉన్న ముకేశ్ కుమార్ మీనాను రిలీవ్ చేయగా…ఎక్సెజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు.

ఏపీ సీఈవోగా వివేక్‌ యాదవ్‌
ఏపీ సీఈవోగా వివేక్‌ యాదవ్‌

ఆంద్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో)గా వివేక్‌ యాదవ్‌ను నియమించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆమోదించింది. ఈ మేరకు సీఎస్ కు లేఖ అందింది. దీంతో ఏపీ సీఈవోగా వివేక్ యాదవ్ బాధ్యతలను స్వీకరించనున్నారు.

yearly horoscope entry point

మొన్నటి వరకు వివేక్ యాదవ్ CRDA కమిషనర్‌గాను బాధ్యతలు నిర్వర్తించారు. ఉన్నారు.  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్‌గా కూడా పని చేశారు. కొత్తగా ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వం ఆయన్ను సీఆర్డీఏ కమిషనర్ బాధ్యతల నుంచి బదిలీ చేసింది. ఇటీవలే కొత్త సీఈవో నియామకానికి ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు పేర్లు పంపించింది. ఇందులో వివేక్ యాదవ్ పేరుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఎక్సెజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముఖేక్ కుమార్ మీనా….

ప్రస్తుతం సీఈవోగా ఉన్న ముకేశ్ కుమార్ మీనాకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త బాధ్యతలను అప్పగించింది. ఎక్సెజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయన్ను నియమించింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగానూ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రమే ఏపీ సీఈవో బాధ్యతల నుంచి ముఖేష్ కుమార్ మీనా రిలీవ్ అయ్యారు.  తాజా నియామకానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు.

అమరావతి పనులు - ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

అమరావతిలో తిరిగి పనుల ప్రారంభించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే  చెట్లను తొలగించే పనులను కూడా ప్రారంభించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. 

గతంలో నిర్మించిన నిర్మాణాల్లో ఐదేళ్ల కాలంలో ఎలాంటి పురోగతి లేదు. తిరిగి వాటిని పూర్తి చేయటంతో పాటుగా భవిష్యత్ నిర్మాణాల పైన ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి. అమరావతిలో మధ్యలో నిర్మాణాలు నిలిచిపోయిన కట్టడాల పటిష్టతపై ముందుగా ఒక అంచనాకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన….  కట్టడాల పటిష్ఠతపై అధ్యయనం చేయించాలని నిర్ణయించినట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఐఐటీ నిపుణులు ఇచ్చే నివేదికల ఆధారంగా నిర్మాణాల విషయంలో ముందుకెళ్తామని  స్పష్టం చేశారు. 

 

 

Whats_app_banner