Varanasi Suicides: ఆర్ధిక సమస్యలతో వారణాసిలో ఏలూరుకు చెందిన అన్నదమ్ముల ఆత్మహత్య, ఏప్రిల్ నుంచి అదృశ్యం
Varanasi Suicides: రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ గత ఏప్రిల్ అదృశ్యమైన అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏలూరు చెందిన సోదరులు స్తిరాస్థి వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో గత ఏప్రిల్‌లో ఊరు విడిచి వెళ్లిపోయారు. వ్యాపార లావాదేవీల నేపథ్యంలో బెదిరింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు.
Varanasi Suicides: ఆర్ధిక ఇబ్బందులతో నాలుగు నెలల క్రితం ఊరు విడిచి వెళ్ళిన అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏలూరు జిల్లా ఉంగటూరుకు చెందిన లక్ష్మీనారాయణ, వినోద్‌లు స్తిరాస్థి వ్యాపారం చేసేవారు. వ్యాపారంలో నష్టం రావడంతో గత ఏప్రిల్‌లో వారిద్దరు ఇళ్లు విడిచి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో కొందరి నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యాయి. దీంతో ఆత్మహత్య చేసుకుంటున్నామని బంధువులకు వీడియోలు రికార్డ్ చేసి ఆత్మహత్య చేసుకున్నారు.
వారణాసిలోని ఆంధ్రా ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న సోదరులు కొద్ది రోజుల క్రితం తాము ఉంటున్న గదిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆశ్రమ నిర్వాహకుల సమాచారంతో పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని బంధువులకు సమాచారం ఇచ్చారు. చనిపోవడానికి ముందు సెల్ఫీ వీడియోలను రికార్డ్ చేసి బంధువులకు పంపారు.
ఉంగటూరుకు చెందిన లక్ష్మీనారాయణ,వినోద్‌ల తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఊరు విడిచి వెళ్లిపోయినట్టు బంధువులు చెబుతున్నారు.
ఏప్రిల్‌లో లక్ష్మీనారాయణ, వినోద్ ఇల్లు విడిచి వెళ్లిపోయారు. ఆర్ధిక లావాదేవీల విషయంలో కొందరు బెదిరిస్తున్నారని బంధువులకు పంపిన వీడియోల్లో పేర్కొన్నారు. నారాయణ పురంకు దండు గోపాల కృష్ణరాజు, గుర్రం పట్టాభి, కమ్ముల గోపీ, సాయితేజ, గుర్రంప్రసాద్ , కమ్ములసాయి అనే వారు తమను బెదిరిస్తున్నారని వీడియోల్లో పేర్కొన్నారు.
ఉంగటూరు మండలం నారాయణపురంకు చెందిన మృతుల బంధువులు వారణాసి వెళ్లారు. అంత్యక్రియలు అక్కడే నిర్వహించనున్నట్టు గ్రామస్తులు తెలిపారు.