Flood Ration: వరద బాధితులకు రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా ఇంటింటికి వరద సాయం పంపిణీ ప్రారంభం-doortodoor distribution of flood relief to flood victims has started regardless of ration card ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Flood Ration: వరద బాధితులకు రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా ఇంటింటికి వరద సాయం పంపిణీ ప్రారంభం

Flood Ration: వరద బాధితులకు రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా ఇంటింటికి వరద సాయం పంపిణీ ప్రారంభం

Sep 06, 2024, 12:58 PM IST Bolleddu Sarath Chandra
Sep 06, 2024, 12:58 PM , IST

  • వరద బారినపడ్డ ప్రతి కుటుంబానికీ నిత్యావసర సరకులు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.  వరదల వల్ల ప్రభావితం అయిన ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ పంచదార, కేజీ కందిపప్పు, ఒక లీటరు వంటనూనె, రెండు కేజీల ఉల్లిపాయలు, రెండు కేజీల బంగాళ దుంపలు పౌర సరఫరాల శాఖ ఇస్తుంది. 

విజయవాడ బి.ఆర్.టి.ఎస్ రోడ్డులో నిత్యావసర సరుకుల ఉచిత పంపిణీకి సిద్ధం చేసిన వాహనాల శ్రేణి… వరద ప్రభావిత ప్రాంతాలలో కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీకి పౌర సరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లూ చేసింది

(1 / 8)

ఇటీవల విజయవాడ మరియు పరిసర ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలు మరియు వరదల కారణంగా విజయవాడతో పాటు  గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవడంతో వారికి సహాయం నిమిత్తం ప్రతి కుటుంబానికి, 25 కేజీలు బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ చక్కర, 1 లీటర్ పామాయిల్, 2 కేజీలు బంగాళాదుంపలు మరియు 2 కేజీలు ఉల్లిపాయలను ఉచితంగా పంపిణీ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  

(2 / 8)

వరద బాధితులకు ప్రభుత్వ సాయాన్ని అందిస్తున్న మంత్రి నాదెండ్ల, కమిషనర్ వీరపాండియన్

(3 / 8)

వరద బాధితులకు సహాయాన్ని రేషన్ మొబైల్ డెలివరి యూనిట్ల ద్వారా ఇంటింటికి అందిస్తున్నారు. నిత్యావసర సరుకులను చౌకధరల దుకాణదారుడు, సచివాలయ సిబ్బంది మరియు MDU ఆపరేటర్లు MDU వాహనాలతో బాధితుల ఇంటి వద్దే పంపిణీ చేస్తారు. 

(4 / 8)

ముంపు ప్రాంతాల్లో నిత్యావసర సరుకులను పొందడానికి ఎక్కడకి వెళ్ళనవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. సరుకులను పొందడానికి రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు దగ్గర ఉంచుకొని, మీ ఇంటి వద్దకు MDU వాహనము వచ్చినప్పుడు వేలిముద్ర వేసి సరుకులను పొందాలని సూచిస్తున్నారు. 

(5 / 8)

వరద ప్రభావిత ప్రాంతాలలో ఉచితంగా పంపిణీ చేసే నిత్యావసర సరుకులతో సిద్ధంగా ఉన్న వాహనాలు విజయవాడ బి. ఆర్. టి. ఎస్. రోడ్డు ముంపు ప్రాంతాలకు బయలుదేరాయి. మొత్తం 1200 వాహనాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి  నాదెండ్ల మనోహర్  తెలిపారు.

(6 / 8)

ఈ-పోస్ విధానంలో వరద బాధితులకు వస్తువులను  పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు ఆధారంగా సరుకులు పంపిణీ చేస్తారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో ఉచిత పంపిణీ చేయనున్నారు.

(7 / 8)

శుక్రవారం ఉదయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల కిట్లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ ను గురువారం సాయంత్రం విజయవాడలో నిర్వహించారు. మంత్రి  మనోహర్ తో పాటు పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొని పంపిణీ విధానాన్ని పరిశీలించారు. 

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు