Cm YS Jagan | 'భావితరాలకు స్ఫూర్తి.. సమతామూర్తి విగ్రహం'-cm ys jagan visits mucchintal s samata murthy statue ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Ys Jagan | 'భావితరాలకు స్ఫూర్తి.. సమతామూర్తి విగ్రహం'

Cm YS Jagan | 'భావితరాలకు స్ఫూర్తి.. సమతామూర్తి విగ్రహం'

HT Telugu Desk HT Telugu
Feb 07, 2022 08:24 PM IST

Samata Murthy statue | ముచ్చింతల్​లోని సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు ఏపీ సీఎం జగన్​. అక్కడ జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. రామానుజాచార్యులు.. అందరూ సమానమే అన్న విషయాన్ని బోధించారని, భావితరాలకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని జగన్​ అన్నారు.

<p>చినజీయర్​ స్వామితో సీఎం జగన్​</p>
చినజీయర్​ స్వామితో సీఎం జగన్​

హైదరాబాద్​కు సమీపంలోని ముచ్చింతల్​లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో.. ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి పాల్గొన్నారు. అసమానతలను తొలగించేందుకు రామానుజాచార్యులు కృషి చేశారని.. ఆయన ఎందరికో స్ఫూర్తిదాయకం అని తెలిపారు.

"ప్రజలందరు సమానమే.. అన్న సందేశాన్ని ఈ సమతామూర్తి విగ్రహం  చాటిచెబుతోంది. భావితరాలకు ఈ విగ్రహం స్ఫూర్తిగా నిలుస్తుంది. అసమానతలను రూపుమాపేందుకు రామానుజాచార్యులు పనిచేశారు. ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న చినజీయర్​ స్వామీకి నా అభినందనలు," అని జగన్​ పేర్కొన్నారు.

సంప్రదాయ దుస్తుల్లో ముచ్చింతల్​కు వెళ్లిన జగన్​.. సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా.. జగన్​పై చినజీయర్​ స్వామి ప్రశంసల వర్షం కురిపించారు.

"దివంగత వైఎస్​ఆర్​.. అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారు. ఇప్పుడు జగన్​ నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయాను. విద్య, ధనం, అధికారం కలిగి ఉన్నవారు సహజంగా ఎవరి సలహాలు తీసుకోరు. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ.. జగన్​లో ఎలాంటి గర్వం లేదు. ఏపీలోని అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు జగన్​. అందుకు ఆయనకు నా అభినందనలు. జగన్ మోహన్​ రెడ్డి..​ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను," అని చినజీయర్​ స్వామి తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం