CM Jagan Stylish Look : స్టైలిష్ లుక్‌లో సీఎం జగన్.. ఇలా ఎప్పుడూ చూసి ఉండరు!
CM Jagan New Look Photo : సీఎం జగన్ పేరు చెప్పగానే.. వైట్ షర్ట్ వేసుకున్న ఫొటోలే గుర్తొస్తాయి. కానీ సూటు, బూటు వేసుకుని కనిపిస్తే.. ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు.
ఎప్పుడూ.. సీఎం జగన్(CM Jagan) వైట్ షర్ట్ వేసుకుని మాత్రమే అగుపిస్తారు. ఆయనకు సంబంధించి ఇతర కలర్ షర్ట్స్ వేసుకున్న ఫొటోలు కనిపించడం అరుదు. ఉన్నా.. ఎప్పుడో పాతవి మాత్రమే దొరుకుతాయి. కానీ తాజాగా సీఎం జగన్ కు సంబంధించిన ఓ ఫొటో మాత్రం తెగ వైరల్ అవుతోంది. అందులో ఆయన స్టైలిష్ లుక్(Stylish Look)లో కనిపిస్తున్నారు. హీరోకు ఏ మాత్రం తగ్గకుండా ఉన్నారని.. ఫొటోను చూసినవారు కామెంట్ చేస్తున్నారు.
నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఫొటో షూట్ అనేది.. సాధారణమే. మోడల్స్ అయినా, సినిమా తారలు అయినా, సెలబ్రెటీలు అయినా పబ్లిక్ లో నిత్యం కనిపించేందుకు ఇలా చేస్తుంటారు. అయితే రాజకీయ నాయకుల్లోనూ కొంతమంది ఈ ట్రెండ్(Trend) ఫాలో అవుతారు. కానీ సీఎం జగన్ కు సంబంధించి.. ఇలాంటి ఫొటో మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు. ఫొటో చూస్తే.. మాత్రం.. నిజంగానే అనిపిస్తుంది. లేకుంటే జగన్ బర్త్ డే సందర్భంగా ఎవరైనా అభిమాని క్రియేట్ చేశారా అనేది కూడా తెలియదు. కానీ చూసేందుకు నిజంగానే జగన్ స్టైలిష్ లుక్(Jagan Stylish Look)లో ఫొటో దిగారా అనిపిస్తుంది.
2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను ఇప్పటికే మెుదలుపెట్టాయి. YSRCPకి మాస్ ఇమేజ్ ఉంది. గ్రామల్లోనూ గట్టి పునాదిని తయారు చేసుకుంది. అయితే విద్యావంతులను కూడా ఆకర్శించేందుకు ఇలాంటి ఫొటోలను వైసీపీ సోషల్ మీడియా క్రియేట్ చేస్తుందని.. కొంతమంది వాదన. మెుత్తానికి.. ఈ ఫొటో మాత్రం వైరల్ అయిపోతుంది.
జగన్ కడప టూర్
మరోవైపు సీఎం జగన్ కడప టూర్(CM Jagan Kadapa Tour) శుక్రవారం నుంచి ఉండనుంది. మూడు రోజులపాటు ఆయన అక్కడే పర్యటించనున్నారు. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ సంఖ్యలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా నిఘా ఉండాలని ఎస్పీ అన్బురాజన్ ఆదేశించారు. సుమారు 3000 మంది పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఈ మేరకు తాజాగా పోలీసు(Police)లకు తమ తమ విధులను ఎస్పీ అన్బురాజన్ కేటాయించారు. మూడు రోజులపాటు సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఉంచాలని చెప్పారు. బాంబు స్క్వాడ్, పోలీసు జాగిలాలు, మెటల్ డిటెక్టివ్ తో సీఎం పర్యటించే ప్రాంతాలను తనిఖీ చేశారు. ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.