AP POLYCET Counselling 2024 : ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు అలర్ట్ - కౌన్సెలింగ్ షెడ్యూల్ లో మార్పులు, కొత్త తేదీలివే-changes in ap polycet counselling schedule 2024 key dates check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Polycet Counselling 2024 : ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు అలర్ట్ - కౌన్సెలింగ్ షెడ్యూల్ లో మార్పులు, కొత్త తేదీలివే

AP POLYCET Counselling 2024 : ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు అలర్ట్ - కౌన్సెలింగ్ షెడ్యూల్ లో మార్పులు, కొత్త తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
May 30, 2024 02:00 PM IST

AP POLYCET Counselling 2024 Updates : ఏపీ పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ - 2024 లో పలు మార్పులు జరిగాయి. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ వివరాలను వెల్లడించింది.

ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ - 2024
ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ - 2024

AP POLYCET Counselling Schedule 2024: ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు సాంకేతిక విద్యాశాఖ కీలక అలర్ట్ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ లో పలు మార్పులు చేసింది. ఈ మేరకు రివైజ్ డ్ షెడ్యూల్ ను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.

కౌన్సెలింగ్ షెడ్యూల్ లో మార్పులు…

ఏపీలో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంది. పోలింగ్ తర్వాత జరిగిన ఘటనల దృష్ట్యా…. పోలీసులు ముందస్తుగానే 144 సెక్షన్‌ ను అమల్లోకి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా…పలు మార్పులు చేశారు.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం చూస్తే…. కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీల్లో ఎలాంటి మార్పులు జరుగలేదు. అభ్యర్థులు యథావిధిగా జూన్ 2 వరకు ఫీజు చెల్లించుకునే అవకాశం ఉంది.

ముందుగా నిర్ణయించినట్లు జూన్ 3న నిర్వహించాల్సిన ధ్రువపత్రాల పరిశీలన తేదీని జూన్ 6వ తేదీకి మార్చారు. ఇక జూన్ 7 నుంచి 10వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. జూన్ 11వ తేదీన వెబ్ ఆప్షన్ల ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి రానుంది. జూన్ 13వ తేదీన సీట్లను కేటాయించనున్నారు. జూన్ 14వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

2024-25 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్‌ నిర్వహించారు. ఫలితాలు ఇప్పటికే వెలువడ్డాయి. మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ నిర్వహించారు. ఈ ఏడాది పదో తరగతి విద్యార్ధులకు ఉన్నత విద్యా మండలి ప్రవేశపరీక్షకు హాజరయ్యేందుకు ఉచిత శిక్షణ కూడా అందించింది. 

ఏపీలో పాలిసెట్ పరీక్షకు మొత్తం 1,42,035 మంది విద్యార్ధులు ప్రవేశ పరీక్షకు హాజరుకాగా, 87.61 శాతం మేర 1,24,430 మంది అర్హత పొందారు. వీరిలో బాలికలు 56,464 మంది పరీక్షకు హాజరుకాగా, 89.81 శాతం మంది, బాలురలో 85,561 మంది హాజరుకాగా 86.16 శాతం అర్హత పొందారు.

ఈ పత్రాలు తప్పనిసరి….

ఏపీ పాలిసెట్ 2024 కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఫీజు చెల్లించిన రశీదు, హాల్‌ టిక్కెట్, ర్యాంక్ కార్డు, పదో తరగతి ఉత్తీర్ణత ధృవపత్రం, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, అర్హులైన వారికి ఈడబ్ల్యుఎస్‌ ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, ప్రత్యేక క్యాటగిరీ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. 

How to view AP POLYCET 2024 Result - ఇలా చెక్ చేసుకోండి

  • ఏపీ పాలిసెట్ పరీక్ష రాసిన విద్యార్థులు https://apsbtet.ap.gov.in లేదా https://polycetap.nic.in/  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో కనిపించే ‘AP POLYCET 2024 Result’ లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ ఆప్షన్ పై నొక్కి మీ ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.
  • అడ్మిషన్ల ప్రక్రియలో ర్యాంక్ కార్డు కీలకం. జాగ్రత్తగా ఉంచుకోవాలి.