CBN On APPSC: గౌతమ్‌ సవాంగ్‌, పిఎస్సార్‌పై చర్యలకు చంద్రబాబు డిమాండ్, గ్రూప్‌1 పై సిబిఐ విచారణ జరపాలన్న బాబు-chandrababu demands action against gautam sawang and psr babu wants cbi investigation on group 1 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn On Appsc: గౌతమ్‌ సవాంగ్‌, పిఎస్సార్‌పై చర్యలకు చంద్రబాబు డిమాండ్, గ్రూప్‌1 పై సిబిఐ విచారణ జరపాలన్న బాబు

CBN On APPSC: గౌతమ్‌ సవాంగ్‌, పిఎస్సార్‌పై చర్యలకు చంద్రబాబు డిమాండ్, గ్రూప్‌1 పై సిబిఐ విచారణ జరపాలన్న బాబు

Sarath chandra.B HT Telugu
Mar 15, 2024 01:48 PM IST

CBN On APPSC: ఏపీపీఎస్సీ నిర్వహణలో లోపాలు, పరీక్షల రద్దుకు కారణమైన కమిషన్ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్‌, ఐపీఎస్‌ అధికారి పిఎస్సార్ ఆంజనేయులుపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు.

2018 గ్రూప్‌ 1పై సిబిఐ విచారణకు బాబు డిమాండ్
2018 గ్రూప్‌ 1పై సిబిఐ విచారణకు బాబు డిమాండ్

CBN On APPSC: ప్రభుత్వ అక్రమాల వల్లే 2018 ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ రద్దు చేయాల్సి వచ్చిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పరీక్షల మూల్యంకనంలో అక్రమాలకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఉండవల్లి నివాసంలో APPSC అక్రమాలపై టీడీపీ అధినేత చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమర్థులైన చైర్మన్ లేకపోవడం ద్వారా బోర్డును సర్వనాశనం చేశారని ఆరోపించారు.

రాజకీయ నిరుద్యోగులకు ఏపీపీఎస్సీని పునరావాస కేంద్రంగా మార్చారని, రాష్ట్ర యువతను దుర్మార్గంగా దగా చేసి వారి ఆశలు చంపేశారని ఆరోపించారు. కమిషన్‌లో తప్పుల ద్వారా క్షమించరాని నేరం చేసిన దుర్మార్గుల్ని ఏం చేసినా తప్పు లేదన్నారు.

నిరుద్యోగ యువత పట్ల క్రూర మృగాలకంటే ఘోరంగా వ్యవహరించారని, - తిట్టేందుకు సరైన మాటలు కూడా రానంత నీచంగా వ్యవహరించారని ఆరోపించారు. కమిషన్‌లో నిక్కచ్చిగా వ్యవహరించిన ఉదయ్‌భాస్కర్‌ను మెడపెట్టి బయటకు పంపారని, అవగాహన లేని అనర్హులకు ఏపీపీఎస్సీలో చోటు కల్పించారన్నారు.

సిఎం జగన్‌కు అనుకూలంగా వ్యవహరించిన గౌతమ్ సవాంగ్‌ను ఛైర్మన్‌గా నియమించారని, 2018లో గ్రూప్-1 ఉద్యోగాల నోటిఫికేషన్‌లో అవినీతే రాజ్యమేలిందని ఆరోపించారు.

గౌతంగ్ సవాంగ్ వచ్చాక మళ్లీ వాల్యుయేషన్‌ దురాలోచనకు తెరలేపారని, మొదటి వాల్యుయేషన్‌ను Valuation దాచిపెట్టి మళ్లీ రెండోసారి చేయాలని నిర్ణయించారని, డిజిటల్ వాల్యుయేషన్ చేయడం ద్వారా మొదటి తప్పు చేశారని, డిజిటల్ వాల్యుయేషన్ చేశాక మాన్యువల్ వాల్యుయేషన్ జరిగిందని, మాన్యువల్ వాల్యుయేషన్ తొక్కిపెట్టి మళ్లీ మరోసారి చేశారని ఆరోపించారు.

రెండో వాల్యుయేషన్ జరగలేదని కోర్టుకు చెప్పారని, వాల్యుయేషన్ జరిగిందనడానికి ఆధారాలు ఉన్నాయన్నారు. మాన్యువల్ వాల్యుయేషన్‌కు వచ్చిన వారి ఖర్చులకు రూ.20 లక్షలు పెట్టారని, ఆవాస రిసార్ట్‌కు రూ.20 లక్షలు చెల్లించినట్లు బిల్లులు ఉన్నాయని, స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతకు కర్నూలు నుంచి కానిస్టేబుళ్లను తీసుకొచ్చారన్నారు.

ఫిబ్రవరి 2022లో గ్రూప్-1 Group 1 ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారని, ఏపీపీఎస్సీ కార్యదర్శిగా వ్యవహరించిన సీతారామాంజనేయులు అక్రమాల్లో భాగస్వామిగా ఉన్నారన్నారు. వాల్యుయేషన్ ప్రక్రియలో బరితెగించి కోర్టును కూడా తప్పుదోవ పట్టించాలని చూశారన్నారు.

తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు కావాల్సిన అభ్యర్థుల కోసం అక్రమాలకు పాల్పడ్డారని, అందుకు తగ్గట్టుగా చైర్మన్ స్థాయిలో ఉన్న గౌతమ్ సవాంగ్ వ్యవహరించారని, ఇన్ని అక్రమాలకు తావిచ్చిన సవాంగ్ ఐపీఎస్‌కు అనర్హుడని మండిపడ్డారు.

2022 మార్చి 25 నుంచి మాన్యువల్ మూల్యంకనం జరిగిందని చెప్పారు. రెండు సార్లు కోర్టుకు తప్పుడు అఫిడవిట్ కూడా ఇచ్చారని బాబు ఆరోపించారు. ఏపీపీఎస్సీలో అక్రమాలు చేసి యువత గొంతు నులిమేశారని, ఒకసారి వాల్యూయేషన్ అయ్యాక రెండోసారి ఎలా చేస్తారని ప్రశ్నించారు.

సీతారామాంజనేయులే రెండోసారి వాల్యూయేషన్ జరపాలని లేఖ రాశారని, రెండోసారి వాల్యూయేషన్ చేయలేదని కోర్టులకు చెప్పారని, గ్రూప్-1 అక్రమాలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలన్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్ సహా ఉన్న వారందరిని తప్పించాలని, గ్రూప్-1 అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలన్నారు.

టీడీపీ హయాంలో ఒక్క విమర్శ కూడా రాకుండా గ్రూప్ పరీక్షలు నిర్వహించామని, సవాంగ్, సీతారామాంజనేయులు దోషులేనని సవాంగ్, సీతారామాంజనేయులు వద్ద నుంచి ఐపీఎస్ హోదాను వెనక్కి తీసుకోవాలన్నారు. జగన్, సజ్జల, సవాంగ్, సీతారామాంజనేయులు, ధనుంజయరెడ్డి అక్రమాలకు కారణమన్నారు. దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే నాశనమేనని, ఏపీపీఎస్సీ కాస్త.. జేపీపీఎస్సీగా మారిందన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం