Trains Cancelled: విశాఖమార్గంలో భారీగా రైళ్ల రద్దు, దారి మళ్లింపు
Trains Cancelled: విజయనగరం జిల్లా కంకటాపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంతో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. రైళ్ల రద్దుతో ఆదివారం రాత్రి నుంచి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
Trains Cancelled: విజయనగరం జిల్లాలో రాయగడ, పలాస ప్యాసింజర్ల ప్రమాదంతో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. రద్దైన రైళ్లలో ట్రైన్ నంబర్ 17243 గుంటూరు - రాయగడ, గుంటూరు - విశాఖపట్నం(17239), కాకినాడ పోర్ట్-విశాఖపట్నం ( 17267), విశాఖపట్నం - కాకినాడ పోర్ట్ (17268) రాజమండ్రి - విశాఖపట్నం( 07466), విశాఖపట్నం- రాజమండ్రి (07467), విజయవాడ - విశాఖపట్నం ( 12718), విశాఖపట్నం - విజయవాడ ( 12717) రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
బరౌనీ - కోయంబత్తూరు ( 03357) మధ్య నడిచే రైలును తిత్లిఘర్, రాంచీ,నాగపూర్, బలార్షా, విజయవాడ మీదుగా మళ్లించారు. టాటానగర్ - ఎర్నాకుళం (18189) రైలును గొట్లం, తిత్లినగర్, నాగపూర్, బలార్షా, విజయవాడ మీదుగా మళ్లిస్తారు. భువనేశ్వర్ - ముంబై (11020) రైలును విజయనగరం, తిత్లిగర్, రాంచీ, నాగపూర్, కాజీపేట మీదుగా మళ్లిస్తారు.
హౌరా -సికింద్రాబాద్( 12703)రైలును విజయనగరం, తిత్లిఘర్‌రాంచీ, నాగరపూర్ కాజీపేట మీదుగా మళ్లిస్తారు. హౌరా-బెంగళూరు (12245) రైలును విజయనగరం, తిత్లిఘర్, రాంచీ, నాగపూర్, బలార్షా, విజయవాడ మీదుగా మళ్లిస్తారు.
సంబల్‌పూర్ - నందేడ్ (20809) రైలును విజయనగరం వరకు మాత్రమే నడుపుతారు.పూరి-తిరుపతి ( 17479) రైలును పూరి-తిరుపతి రైలును బాలు వరకు నడుపుతారు. ముంబై -భువనేశ్వర్ (11019) రైలును నేడు విశాఖపట్నం వరకు మాత్రమే నడుపుతారు. భువనేశ్వర్-ముంబై(11020) రైలును భువనేశ్వర్-విశాఖపట్నం మధ్య రద్దు చేశారు.
హౌరా-బెంగళూరు (12863), హౌరా-పుదుచ్చేరి(12867), హౌరా-చెన్నై సెంట్రల్(12839), షాలిమార్-త్రివేండ్రం (22642) రైళ్లను రీ షెడ్యూల్ చేశారు.
మంగుళూరు-సంత్రగచ్చి(22852), బెంగుళూరు-హౌరా(12246), తిరుపతి -హౌరా(20890), సికింద్రాబాద్ - హౌరా (12704), బెంగుళూరు - హౌరా (12864), బెంగుళూరు - జసిద్ద్ (223050, కన్యాకుమారి - బెంగుళూరు( 22503) చెన్నై సెంట్రల్- హౌరా ( 12840), వాస్కో డ గామా- షాలిమార్ (18048) , అగర్తలా - బెంగుళూరు (12504), హతియా -బెంగళూరు (12835 రైళ్లను దారి మళ్లించారు