YS Viveka Murder Case: అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణ సెప్టెంబర్‌లో విచారణ…
YS Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి మంజూరైన బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె దాఖలు చేసిన పిటిషన్ సెప్టెంబర్‌కు వాయిదా పడింది. దీంతో పాటు బెయిల్ కోసం గంగిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణ కూడా వాయిదా పడింది.
YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని సునీత దాఖలు చేసిన పిటిషన్‍పై విచారణ జరిగింది. దీంతో పాటు నిందితుడు గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని దాఖలైన పిటిషన్లను కూడా ధర్మాసనం విచారించింది.
ఈ పిటిషన్లపై విచారణను సెప్టెంబర్ రెండో వారంలో విచారణ చేపడతామన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. వివేకా హత్య కేసు వివరాలు, డైరీలను సీల్డ్ కవర్‍లో అందించాలని సీబీఐకి ఆదేశించింది. జూన్ 30న దాఖలు చేసిన ఛార్జిషీట్ కూడా సీల్డ్ కవర్‍లో సమర్పించాలని సుప్రీం కోర్టు సిబిఐను ఆదేశించింది.
అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‍పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశించింది. మరోవైపు గంగిరెడ్డికి జూన్ 30న బెయిల్ ఇవ్వాలన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై గతంలో సుప్రీంకోర్టు స్టే విధించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని సుప్రీంకోర్టు చేయడంతో తనకు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని గంగిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
గంగిరెడ్డి పిటిషన్‍నూ అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్‍కు సుప్రీం కోర్టు జత చేసింది. రెండూ పిటిషన్లపై ఒకేసారి విచారణ జరుపుతామని ప్రకటించింది. విచారణ సందర్భంగా గంగిరెడ్డి తరఫు న్యాయవాదిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. హత్యకేసులో బెయిల్ వ్యవహారాలు ఆచితూచి ఉంటాయని స్పష్టం చేసింది. కేసులో చాలా సాక్ష్యాలున్నాయని నిందితుడు బెయిల్ కోసం వేచిచూడాల్సిందేనని స్పష్టం చేసింది. అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్‍తో జతచేయొద్దన్న విజ్ఞప్తిని సైతం సుప్రీం కోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది.