APSRTC Special Buses : గుడ్ న్యూస్... సంక్రాంతికి ఏపీఆర్టీసీ 6,795 ప్రత్యేక బస్సులు - సాధారణ ఛార్జీలతోనే టికెట్లు!-apsrtc to run 6795 special buses for sankranti festival 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsrtc Special Buses : గుడ్ న్యూస్... సంక్రాంతికి ఏపీఆర్టీసీ 6,795 ప్రత్యేక బస్సులు - సాధారణ ఛార్జీలతోనే టికెట్లు!

APSRTC Special Buses : గుడ్ న్యూస్... సంక్రాంతికి ఏపీఆర్టీసీ 6,795 ప్రత్యేక బస్సులు - సాధారణ ఛార్జీలతోనే టికెట్లు!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 06, 2024 10:05 AM IST

APSRTC Sankranti Special Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీఎస్ఆర్టీసీ. సంక్రాంతి పండగ నేపథ్యంలో.. రెగ్యులర్‌ సర్వీసులతో పాటు అదనంగా 6,795 ప్రత్యేక బస్సులు అందుబాటులోకి నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. శనివారం నుంచే ఈ బస్సులు రోడ్డెక్కనున్నాయి.

సంక్రాంతి ప్రత్యేక బస్సులు
సంక్రాంతి ప్రత్యేక బస్సులు

APSRTC Sankranti Special Buses: సంక్రాంతి పండగ వేళ ఊళ్లలోకి వెళ్లే వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంది. పండగ వేళ ప్రత్యేకంగా 6,795 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే రెగ్యూలర్ సర్వీసులతో పాటు ఇవి అదనంగా తిరగనున్నాయి. ఇవాళ్టి నుంచి జనవరి 18 వరకు ఈ బస్సులు సేవలు అందిస్తాయని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని తెలిపారు.

yearly horoscope entry point

జనవరి 6(శనివారం) నుంచి 14 వరకు 3,570 బస్సులు, తిరుగు ప్రయాణాల కోసం జనవరి 16 నుంచి 18 వరకు మరో 3,225 బస్సులు నడిపేలా ఏర్పాటు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ పేర్కొంది. ఈ నెల 10 నుంచి 13వ తేదీ మధ్య రెగ్యులర్‌ సర్వీసుల్లో ముందుస్తు రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయని వెల్లడించింది. ఆయా మార్గాల్లో ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు వివరించారు. వీటిల్లో కూడా రిజర్వేషన్లు మొదలైనట్లు ప్రకటించారు.

ఏపీలోని వివిధ ప్రాంతాలతోపాటు, హైదరాబాద్‌, చెన్నై,బెంగళూరు తదితర నగరాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందిచింది ఆర్టీసీ. ప్రయాణికులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేందుకు…. 149 నెంబర్ తో పాటు 0866-2570005 నంబరను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయాణికులు ఫోన్‌ చేసి వివరాలను తెలుసుకోవచ్చు.

టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Telangana State Road Transport Corporation: మరోవైపు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్అర్టిసి ) అలర్ట్ ఇచ్చింది.సం క్రాంతి పండుగ సందర్భంగా 4,484 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచనునట్లు వెల్లడించింది.జనవరి 6 నుంచి జనవరి 15 వరకు హైదరాబాద్ నుంచి కర్ణాటక,ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

ఈ ప్రత్యేక బస్సులో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తామని సంస్థ ఎండీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులను క్షేమంగా వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు అన్నీ ఏర్పాటు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అయన తెలిపారు.

" చార్జీల పై ఎలాంటి పెంపుదల లేకుండా సాధారణ చార్జీల తోనే ప్రత్యేక బస్సులను నడుపుతున్నాం.ఉప్పల్ క్రాస్ రోడ్స్,ఎల్బి నగర్,కేపిహెచ్ని మరియు తదితర రద్దీ ప్రాంతాల్లో తాగునీరు,మొబైల్ టాయ్లెట్ ల సౌకర్యాలను అందుబాటులో ఉంచాం.బస్ భవన్,గాంధీ బస్ స్టాప్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ల ద్వారా రద్దీ ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికపుడు ఆర్టీసీ ఉన్నతాధికారులు పర్యవేక్షించేందుకు అవకాశం ఉంది. ప్రయాణికులను ఇన్ టీం లోనే వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు టోల్ గేట్ల వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ఒక ప్రత్యేక లేన్ ల ఏర్పాటు జరిగింది.అధిక ఛార్జీలు వెచ్చించి ప్రైవేట్ బస్సులో ప్రయాణించే బదులు, యావెరజ్ చార్జీలతో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి సురక్షితంగా మీ గమ్య స్థానాలకు చేరండి " అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రజలకు,ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.

Whats_app_banner