AP PGCET: విద్యార్థులకు అలర్ట్… ఏపీ పీజీసెట్-2022 నోటిఫికేషన్ విడుదల
APPGCET Notification: ఏపీపీజీసెట్-2022 నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ మేరకు యోగివేమన వర్సిటీ షెడ్యూల్ ను ప్రకటించింది. ఆగస్టు 17 నుంచి పరీక్షలు మొదలు కానున్నాయి.
AP PGCET - 2022 Notification: ఏపీ పోస్టు గ్రాడ్యుయేషన్స్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ పీజీసెట్ )- 2022 నోటిఫికేషన్ విడుదలైంది. ఈమేరకు యోగివేమన విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య మునగల సూర్యకళావతి విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్న 16 విశ్వవిద్యాలయాలు, అనుబంధ పోస్టుగ్రాడ్యుయేషన్, ప్రైవేటు, అన్ఎయిడెడ్, మైనార్టీ కళాశాలల్లో ఉన్న 145 కోర్సులకు ఒకే నోటిఫికేషన్ (ఏపీపీజీసెట్-22) ద్వారా సీట్లు భర్తీ చేయనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి M.A., M.Com., M.Sc., MCJ, M.Lib.Sc., M.Ed., M.P.Ed., M.Sc.Tech కోర్సుల్లో సీట్లు కేటాయిస్తారు.
చివరి తేదీ….
ఆన్లైన్ దరఖాస్తుకు జులై 20వ తేదీని చివరి తేదీగా ప్రకటించారు. రూ.500 ఆలస్య రుసుంతో జులై 27వ తేదీ వరకు... అలానే రూ.1000 ఆలస్య రుసుంతో జులై 29వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. దరఖాస్తు రుసుం ఓసీ అభ్యర్థులకు రూ.850, బీసీ అభ్యర్థులకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.650 చెల్లించాలి. డిగ్రీ చివరి సెమిస్టరులో ఉన్నవారు సైతం ఏపీపీజీసెట్-2022 రాసేందుకు అర్హులుగా పేర్కొన్నారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష...
రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు ఆగస్టు 17వ తేదీ నుంచి ఆన్లైన్ విధానంలో కంప్యూటరు ఆధారిత టెస్ట్ (సీబీటీ)లు జరుగుతాయని ప్రకటనలో వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సౌకర్యార్థం హైదరాబాద్‌లోనూ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ముఖ్య తేదీలు...
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం - జూన్ 22, 2022
ఆన్లైన్ దరఖాస్తుకు గడువు - జులై 20, 2022
రూ.500 ఆలస్య రుసుంతో గడువు - జులై 27, 2022
రూ.1000 ఆలస్య రుసుంతో గడువు - జులై 29, 2022
పరీక్షలు ప్రారంభం - ఆగస్టు 17, 2022
NOTE: పీజీ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఈ లింక్ పై క్లిక్ చేసి పూర్తి చేయవచ్చు.
పూర్తి వివరాల కోసం www.yvu.edu.in సైట్ ను సందర్శించవచ్చు.
టాపిక్