AP Police SI Exam Key : ఏపీ ఎస్సై తుది రాత పరీక్షల కీ విడుదల, అభ్యంతరాలుంటే మెయిల్ చేయొచ్చు!
AP Police SI Exam Key :ఏపీ ఎస్సై తుది రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రెండ్రోజుల పాటు జరిగిన పరీక్షల ప్రైమరీ కీలను పోలీస్ నియామక బోర్డు ఆదివారం విడుదల చేసింది.
AP Police SI Exam Key : ఏపీ ఎస్సై తుది రాత పరీక్షల ప్రాథమిక కీని పోలీసు నియామక బోర్డు ఆదివారం విడుదల చేసింది. శని, ఆదివారాల్లో జరిగిన ఎస్సై తుదిరాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రంలోని విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూలులో ఎస్సై రాత పరీక్షలు నిర్వహించారు. తుది రాతపరీక్షలకు మొత్తంగా 31,193 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. శనివారం జరిగిన పేపర్-1 (ఇంగ్లిష్), పేపర్-2 (తెలుగు) పరీక్షలకు 30,585 మంది అభ్యర్థులు హాజరుకాగా, ఆదివారం జరిగిన పేపర్-3 (అరిథ్‌మెటిక్, మెంటల్ ఎబిలిటీ) పరీక్షకు 30,569 మంది, పేపర్-4(జనరల్ స్టడీస్) పరీక్షకు 30,560 మంది హాజరయ్యారని ఏపీఎస్ఎల్పీఆర్బీ తెలిపింది. రెండ్రోజుల పాటు నిర్వహించిన పరీక్షల ప్రైమరీ కీలను పోలీసు నియామక బోర్డు విడుదల చేసింది.
అభ్యంతరాలుంటే?
అభ్యర్థులకు కీపై అభ్యంతరాల ఉంటే అక్టోబర్ 18వ తేదీ సాయంత్రం 5 గంటలోపు నిర్ణీత ఫార్మాట్‌లో slprbap.obj@gmail.comకు మెయిల్ చేయాలని అధికారులు సూచించారు. అభ్యర్థుల అభ్యంతరాలను పరిశీలించి తుది కీ, ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో https://slprb.ap.gov.in/ కీ, ప్రశ్నాపత్రాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మెయిన్స్‌కు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31,193 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారిలో పురుషులు 27,590 మంది, మహిళలు 3,603 మంది ఉన్నారు.మెయిన్స్ పరీక్షలను విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు కేంద్రాల్లో నిర్వహించారు.