Skill Scam Case : చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు… తీర్పు రిజర్వ్‌-ap high court reserves judgment on chandrababu naidu bail plea in skill scam case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Skill Scam Case : చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు… తీర్పు రిజర్వ్‌

Skill Scam Case : చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు… తీర్పు రిజర్వ్‌

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 16, 2023 05:22 PM IST

Skill development case Updates: స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది.

చంద్రబాబు బెయిల్ పిటిషన్
చంద్రబాబు బెయిల్ పిటిషన్

Skill development Case Updates: స్కిల్‌ డెలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు రెగ్యూలర్ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సీఐడీ తరపున వాదనలు ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపించగా… చంద్రబాబు తరపు వాదనలు సిద్ధార్ధ్ లూథ్రా వాదించారు. ఇరువైపు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును తీర్పు రిజర్వ్‌ చేసింది.

లూథ్రా వాదనలు…

చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపిస్తూ…. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కావాలనే చంద్రబాబును అరెస్టు చేశారని అన్నారు. ఈ కేసులో 2018 నుంచి విచారణ జరుగుతుంటే.. ఇప్పుడు ఇంత హడావుడిగా విచారణ చేయాల్సిన అవసరం ఏముందని ప్రస్తావించారు. చంద్రబాబును ఇరికించడం కోసమే ఇదంతా చేశారని అన్నారు. చంద్రబాబుకు వెంటనే బెయిల్ ఇవ్వాలని కోరారు.

సీఐడీ తరపున హైకోర్టులో ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపించారు. చంద్రబాబు పలు అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని… చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అన్న పొన్నవోలు…. ఈ కేసు తీర్పు ద్వారా సమాజానికి ఒక మెసేజ్ వెళ్లాలని వాదించారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని… చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా మూడు 10 రూపాయల నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్ల రూపాయలు హైదరాబాద్‌కు తరలించారని…. బోస్‌ అనే వ్యక్తి ఫోన్‌ మెస్సేజ్‌ల ద్వారా ఈ విషయం బయటపడిందని వివరించారు. సీమెన్స్‌ వారే నిధులు మళ్లింపు జరిగిందని నిర్థారించారని… చంద్రబాబు ఆదేశాల మేరకే ఆ విధంగా వ్యవహరించారని చెప్పారు. చీఫ్‌ సెక్రటరీ తన లెటర్‌లో అప్పటి సీఎం రూ.270 కోట్లు విడుదల చేయమని చెప్పారని ఫైనాన్స్‌ సెక్రటరీకి లేఖ రాశారని వాదించారు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు.

ఇరువైపు వాదనలు విన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం…. తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పటికే అనారోగ్య కారణాల రీత్యా ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు అయిన సంగతి తెలిసిందే. అయితే రెగ్యూలర్ బెయిల్ పై వాదనలు ముగియగా…. హైకోర్టు ఏం చెప్పబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

Whats_app_banner