APHC on TTD : టీటీడీకి వ్యాపార ధోరణి సరికాదన్న హైకోర్టు….-ap high court orders ttd to provide special darshans for earlier bookings ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Aphc On Ttd : టీటీడీకి వ్యాపార ధోరణి సరికాదన్న హైకోర్టు….

APHC on TTD : టీటీడీకి వ్యాపార ధోరణి సరికాదన్న హైకోర్టు….

B.S.Chandra HT Telugu
Sep 25, 2022 06:47 AM IST

APHC on TTD తిరుమల తిరుపతి దేవస్థానానికి వ్యాపార ధోరణి సరికాదని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది. శ్రీ వేంకటేశ్వరుడి మేల్ ఛాట్‌ వస్త్ర సేవ, ఆర్జిత సేవల కోసం 14 ఏళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్న వారికి కోవిడ్ పేరుతో సేవల్ని ఏకపక్షంగా రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. టీటీడీ వాదనల్ని తిరస్కరించిన న్యాయస్థానం ఆర్జిత దర్శన సేవలు కల్పించాల్సిందేనని తేల్చి చెప్పింది.

<p>టిక్కెట్లు కొన్న వారికి ఆర్జిత సేవలు కల్పించాల్సిందేనన్నహైకోర్టు</p>
టిక్కెట్లు కొన్న వారికి ఆర్జిత సేవలు కల్పించాల్సిందేనన్నహైకోర్టు

APHC on TTD తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆర్జిత సేవల్ని ఏకపక్షంగా రద్దు చేయడంపై ఇటీవల పలువురు భక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. కొద్ది వారాల క్రితం తమిళనాడు భక్తుడు కూడా కోవిడ్ ఆంక్షల పేరుతో దర్శనాలు రద్దు చేయడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాజాగా ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా టీటీడీ తీరును హైకోర్టు తప్పు పట్టింది.

కోవిడ్ ఆంక్షల కారణంగా తిరుమలలో నిర్వహించే సేవల్ని ముందే బుక్ చేసుకున్న వారికి టీటీడీ అందించలేకపోయింది. 14ఏళ్ల క్రితం శ్రీవారి మేల్ ఛాట్‌ వస్త్ర సేవతో పాటు ఆర్జిత సేవల కోసం టిక్కెట్లు కొనుగోలు చేసిన వ్యక్తికి కోవిడ్ నిబంధనల పేరుతో సేవల్ని టీటీడీ నిరాకరించింది. 2020 మార్చి నుంచి రెండేళ్ల పాటు పలువురికి ఇలా జరిగింది. ఈ నేపథ్యంలో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. శ్రీవేంకటేశ్వర స్వామి మేల్ ఛాట్ వస్త్ర సేవ, ఆర్జిత సేవల్ని కల్పించకపోవడంపైAPHC on TTD ధర్మాసనం తప్పుపట్టింది.

ఎన్నో ఏళ్ల క్రితం శ్రీవారి సేవల కోసం టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారికి కాకుండా కొత్త వారికి సేవలు కల్పించడాన్ని తప్పు పట్టింది. గతంలో టిక్కెట్లు పొందిన భక్తులకు కోవిడ్ తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడిన తర్వాత ఆర్జిత సేవలను అందుబాటులోకి తీసుకువస్తే టీటీడీకి ఆదాయం లభించదు కాబట్టి అధిక ఆదాయం కోసం కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నారని హైకోర్టుAPHC on TTD అభిప్రాయపడింది.

భక్తుల భావోద్వేగాలను సొమ్ము చేసుకునేలా టీటీడీ వ్యాపార ధోరణి అవలంబించడాన్ని హైకోర్టు APHC on TTD తప్పు పట్టింది. టీటీడీలో లాభాపేక్ష ధోరణిను జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తప్పు పట్టారు. 2007లో మేల్ ఛాట్ వస్త్ర సేవల కోసం టిక్కెట్లు కొనుగోలు చేసిన ఆర్‌.ప్రభాకర్‌ రావు అనే భక్తుడికి 2021 డిసెంబర్ 17న దర్శన సదుపాయాన్ని కేటాయించారు. కోవిడ్ ఆంక్షల పేరుతో ఆ సమయంలో మేల్ ఛాట్ వస్త్ర సేవల్ని నిర్వహించలేదు. దీంతో ప్రభాకర్‌ రావు హైకోర్టును ఆశ్రయించారు. సుప్రభాతం, తదితర సేవల్ని బుక్ చేసుకున్న వారి టిక్కెట్లను కూడా ఏక పక్షంగా రద్దు చేశారని మరికొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవల కోసం చెల్లించిన సొమ్మును వాపసు తీసుకోవాలని టీటీడీ భక్తులకు సూచించింది.

శ్రీవారి సేవల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న తమ మనో భావాలను టీటీడీ పట్టించుకోలేదని, ఏకపక్షంగా టిక్కెట్లను రద్దు చేసిందని ఆరోపిస్తూ న్యాయస్థానాన్నిAPHC on TTD ఆశ్రయించారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు విద్యాసాగర్‌, సిహెచ్‌.ధనుంజయ్‌లు వాదనలు వినిపించారు. 14 ఏళ్లుగా శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న వారు దర్శనానికి అన్ని విధాలుగా అర్హులని, సేవలు ప్రారంభమయ్యాక ఒకటి రెండేళ్లలో వారికి అవకాశం కల్పించాలని కోరారని, టీటీడీ మాత్రం ఏకపక్షంగా వారి టిక్కెట్లను రద్దు చేసిందని వివరించారు.

మొత్తం 17,490 మంది టిక్కెట్లు పొందితే వారిలో 8347 మంది బ్రేక్‌ దర్శనాలతో సరిపెట్టుకున్నారని, 191మంది మాత్రమే డబ్బు వెనక్కి తీసుకున్నారని చెప్పారు. పిటిషన్లు దాఖలు చేసిన వారితో పాటు మిగిలిన వారు ఎలాంటి ఆప్షన్ ఇవ్వలేదని కోర్టుకు ఫిర్యాదు చేశారు. టీటీడీ మాత్రం కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు, మార్గ దర్శకాల వల్ల దర్శనాలు, ఆర్జిత సేవల్ని నిలిపివేసినట్లు చెప్పారు. టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ తగ్గాక పాతవారిని సర్దుబాటు చేయలేమని, అప్పటికే అయా తేదీలను వేరే వారికి కేటాయిస్తారని వివరించారు. పిటిషనర్ల వాదనలు సరికాదని వాటిని కొట్టివేయాలని టీటీడీ కోరింది.

ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ఈ ఏడాది జూన్‌,జులై నెలల్లో ఆర్జిత సేవల టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటూ గత మేలో టిటిడి నోటిఫికేషన్ ఇవ్వడాన్ని గుర్తు చేసింది. కొత్తగా భక్తులకు ఆర్జిత సేవల్ని కల్పిస్తూ పాతవారికి నిరాకరించడం ఆర్టికల్ 14 ఉల్లంఘనే అవుతుందని APHC on TTD చెప్పారు. పిటిషనర్లు కోరుకున్న విధంగా ఆర్జిత సేవలు అందించాల్సిందేనని, టీటీడీకి-పిటిషనర్లకు అనుకూలమైన తేదీలను , సమయాలను అయా సేవల కోసం ఖరారు చేయాలని ఆదేశించారు. భక్తులతో సంప్రదించి మూడు నెలల్లో కోవిడ్ కారణంగా దర్శనాలు, సేవలు పొందలేకపోయిన వారందరికి కొత్త తేదీలను కేటాయించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

Whats_app_banner