Earphones Driving : వాహనదారులకు బిగ్ షాక్, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే రూ.20 వేలు ఫైన్!-ap govt ready to implement earphone driving charges rs 20k fine ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Earphones Driving : వాహనదారులకు బిగ్ షాక్, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే రూ.20 వేలు ఫైన్!

Earphones Driving : వాహనదారులకు బిగ్ షాక్, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే రూ.20 వేలు ఫైన్!

Bandaru Satyaprasad HT Telugu
Jul 26, 2023 02:42 PM IST

Earphones Driving : స్టైల్ గా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ లేదా ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంటారు. ఇకపై ఇలాంటివి కుదరవని ఏపీ సర్కార్ తెలిపింది. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే రూ.20 వేలు ఫైన్ విధిస్తామని ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఇయర్ ఫోన్ పెట్టుకుంటే రూ.20 వేలు ఫైన్
ఇయర్ ఫోన్ పెట్టుకుంటే రూ.20 వేలు ఫైన్

Earphones Driving : వాహనదారులకు ఏపీ ప్రభుత్వం బిగ్ షాక్ ఇవ్వబోతుందని తెలుస్తోంది. ఇకపై ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాహనం నడిపితే రూ.20 వేల ఫైన్ విధించాలని భావిస్తోంది. ఈ విషయంపై రవాణా శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు వెలువడలేదు. కానీ ఇలాంటి నిబంధనలు తీసుకొచ్చేందుకు అధికారుల కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్, హెడ్ సెట్ పెట్టుకుంటే రూ.20 వేలు ఫైన్ వేయబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్లు సమాచారం. బైక్, కారు, ఆటో.. మరే ఇతర వాహనంలో అయినా ఇయర్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తూ భారీగా ఫైన్ పడడం ఖాయంగా కనిపిస్తోంది.

సెల్ ఫోన్ డ్రైవింగ్ తో పెరుగుతున్న ప్రమాదాలు

ఏపీ సర్కార్ రవాణా శాఖ నిబంధనలు సవరించి, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే రూ. 20 ఫైన్ విధిస్తారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలకు సెల్ ఫోన్ ఎక్కువగా కారణమని తెలుస్తోంది. ఫోన్‌ చూస్తూ లేదా మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను నివారించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త నిబంధనను అమలుచేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ , హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే భారీగా ఫైన్ విధించాలని నిర్ణయించింది. రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు రవాణా శాఖ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే రవాణా శాఖ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

అదంతా ఫేక్ న్యూస్- రవాణాశాఖ

ఈ అంశంపై ఏపీ రవాణా శాఖ స్పందించింది. ఇదంతా అసత్య ప్రచారమని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే రాష్ట్రంలో సవరించిన ఫైన్స్ వసూలు చేస్తున్నట్లు తెలిపింది. మోటార్‌ వెహికిల్‌ యాక్ట్‌ ప్రకారం ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ ఫోన్ పెట్టుకుని వాహనం నడిపి పట్టుబడితే మొదటి రూ. 1500 నుంచి రూ. 2 వేలు వరకు జరిమానా విధిస్తున్నట్లు అధికారులు చెప్పారు. పదేపదే పట్టుబడితే రూ. 10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. ఈ నిబంధన చాలా కాలంగా అమల్లో ఉందన్నారు. జరిమానా రూ.20 వేలకు పెంచే ఆలోచన లేదని రవాణా శాఖ కమిషనర్‌ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించారు.

IPL_Entry_Point