APPSC Groups Notification : నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, 597 గ్రూప్-1, 2 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి-ap govt green signal to appsc to fill 597 group 1 and 2 posts notifications soon ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Groups Notification : నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, 597 గ్రూప్-1, 2 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి

APPSC Groups Notification : నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, 597 గ్రూప్-1, 2 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి

Bandaru Satyaprasad HT Telugu
Aug 28, 2023 10:31 PM IST

APPSC Groups Notification : ఏపీ ప్రభుత్వం 597 గ్రూప్-1, 2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

ఏపీపీఎస్సీ జాబ్స్
ఏపీపీఎస్సీ జాబ్స్

APPSC Groups Notification : ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొత్తం 597 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిల్లో 89 గ్రూప్‌-1 పోస్టులు, 508 గ్రూప్‌-2 పోస్టులను ఉన్నాయి. గ్రూప్‌- 1 విభాగంలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ కేటగిరీ-II, అసిస్టెంట్‌ కమిషనర్‌, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ పోస్టులతో సహా పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గ్రూప్‌-2 కేటగిరీ కింద డిప్యూటీ తహసీల్దార్లు, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-III, సబ్‌ రిజిస్ట్రార్‌ తో పాటు మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీంతో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తుంది.

గ్రూప్‌ - 1 పోస్టులు - 89

  • డిప్యూటీ కలెక్టర్ - 12
  • డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్- 05
  • డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్-04
  • డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అసిస్టెంట్ డైరెక్టర్ - 01
  • అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ - 02
  • డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ - 01
  • మున్సిపల్ కమిషనర్ (Grade -2) - 01
  • డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ - 03
  • అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ - 06
  • డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ - కేటగిరీ -II - 25
  • డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (మెన్) - 01
  • అసిస్టెంట్ కమిషనర్ (ST) - 18
  • అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ - 01
  • డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ - 03
  • రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ - 06

గ్రూప్ - 2 లో ఖాళీ పోస్టులు-508

  • ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సెక్రటేరియట్) - 23
  • న్యాయ శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సెక్రటేరియట్) - 12
  • లెజిస్లేచర్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సెక్రటేరియట్) - 10
  • జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సెక్రటేరియట్) - 161
  • మున్సిపల్ కమిషనర్ (Grade - II)I - 04
  • డిప్యూటీ తహసీల్దార్ (Grade - II) - 114
  • సబ్ - రిజిస్ట్రార్ (Grade - II) - 16
  • ఎక్సైజ్ సబ్ ఇన్స్‌పెక్టర్ - 150
  • అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ - 18