తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Suicide For Ts Group1: గ్రూప్‌1 వాయిదాతో యువకుడి ఆత్మహత్య

Suicide for TS Group1: గ్రూప్‌1 వాయిదాతో యువకుడి ఆత్మహత్య

Sarath chandra.B HT Telugu

11 January 2024, 8:36 IST

    • Suicide for TS Group1: తెలంగాణలో గ్రూప్‌1 పరీక్ష వాయిదాతో మనస్తాపం చెందిన ఓ భద్రాద్రి కొత్తగూడెం  యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
గ్రూప్‌1 వాయిదాతో యువకుడి ఆత్మహత్య
గ్రూప్‌1 వాయిదాతో యువకుడి ఆత్మహత్య

గ్రూప్‌1 వాయిదాతో యువకుడి ఆత్మహత్య

Suicide for TS Group1: తెలంగాణ గ్రూప్‌ పరీక్ష వాయిదాతో మనస్తాపం చెందిన యువకుడు రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన యువకుడిగా రైల్వే పోలీసులు గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు

TS LAWCET 2024 Updates : టీఎస్ లాసెట్ కు భారీగా దరఖాస్తులు - ఈ సారి 3 సెష‌న్ల‌లో ఎగ్జామ్, ఫైన్ తో అప్లికేషన్లకు ఛాన్స్

TSRTC Jeevan Reddy Mall : అద్దె ఒప్పందం రద్దు , జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం - టీఎస్ఆర్టీసీ ప్రకటన

Telangana Rains : కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం - పిడుగుపాటుతో ఇద్దరు మృతి

Bhadradri District : ఎంత అమానుషం! పండగకు చందా ఇవ్వలేదని 19 కుటుంబాల గ్రామ బహిష్కరణ

తెలంగాణ గ్రూప్‌ 1 పరీక్షల వాయిదా నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఇప్పటికే ఉద్యోగాల మీద గంపెడాశలతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజాగా మరో యువకుడు రైలు కిందపడి ప్రాణాలు విడిచాడు.

ఖమ్మం ప్రభుత్వ గవర్నమెంట్‌ రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని గణేశ్‌ బస్తీకి చెందిన తల్లాడ శ్రీసత్య ఉమాశంకర్‌(36) మహారాష్ట్ర విద్యుత్తు శాఖలో ఆరేళ్లుగా ఏఈగా పని చేస్తున్నారు.ఇంటికి దూరంగా విధులు నిర్వర్తించాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు.

గత ఏడాది కాలంగా తెలంగాణ గ్రూప్‌-1 పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. పరీక్షలకు హాజరయ్యేందుకు గత నెలలో ఉద్యోగానికి సెలవు పెట్టిన ఉమాశంకర్‌ కొత్తగూడెం వచ్చి ఇంట్లోనే ఉంటూ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

మహారాష్ట్రలో ఉద్యోగం కోసం ఒక్కరే ఉండడంతో బాధ పడుతుండేవారని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. సాంకేతిక కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్‌-1 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం, ఒంటరితనంతో ఉమా శంకర్‌ కుంగిపోయారు.

పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలీక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కొత్తగూడెం నుంచి ఖమ్మం వచ్చి బుధవారం తెల్లవారుజామున 3:50 గంటల సమయంలో నగర శివారులోని దానవాయిగూడెం సాగర్‌ కాల్వ వంతెన సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

యువకుడి ఆత్మహత్య సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్సై పి.భాస్కర్‌రావు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.sa

తదుపరి వ్యాసం