తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Polluted Cities In India : ఇండియాలో అత్యంత కాలుష్య నగరంగా హైదరాబాద్

Polluted Cities In India : ఇండియాలో అత్యంత కాలుష్య నగరంగా హైదరాబాద్

HT Telugu Desk HT Telugu

23 October 2022, 18:23 IST

    • Air Quality Report : స్విస్‌కు చెందిన ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ IQAir నివేదిక ప్రకారం ఇండియాలో హైదరాబాద్ నగరం అత్యంత కాలుష్య నగరంగా ఉంది. వాయు కాలుష్య స్థాయి 159 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI)గా నమోదైంది.
హైదరాబాద్
హైదరాబాద్

హైదరాబాద్

భారతదేశంలో అత్యంత కాలుష్య నగరంగా హైదరాబాద్(Hyderabad) నాలుగో స్థానంలో ఉంది. భారతదేశం ముఖ్యమైన నగరాల్లో, దిల్లీ, కోల్‌కతా, ముంబై తర్వాత నాల్గో అత్యంత కాలుష్య నగరంగా హైదరాబాద్ ఉంది. ఇది దేశంలోని దక్షిణ భారతంలో అత్యంత కలుషితమైన సిటీగా నమోదైంది. అక్టోబర్ 21న IQAir వెబ్‌సైట్‌లోని డేటా ప్రకారం, నగరంలో వాయు కాలుష్య స్థాయి 159 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI)గా ఉంది.

ప్రధాన కాలుష్య కారకం ఆటోమొబైల్స్(Auto Mobiles), పరిశ్రమలుగా ఉన్నాయి. నగరంలో వాయు కాలుష్యంలో మూడో వంతు వాహనాలే కారణమని విశ్లేషకులు అంటున్నారు. హైదరాబాద్‌లో PM2.5 గాఢత ఒక క్యూబిక్ మీటర్ గాలికి 70.4 మైక్రోగ్రాములుగా ఉంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వార్షిక గాలి నాణ్యత మార్గదర్శక విలువ కంటే 14.1 రెట్లు ఎక్కువ.

హైదరాబాద్‌లో శిలాజ ఇంధనాలు కాల్చడం, పారిశ్రామిక సంస్థల నిర్మాణం, ల్యాండ్‌ఫిల్‌ను తెరవడంతోపాటుగా గాలి నాణ్యత క్షీణించడానికి వాహన కాలుష్యం అతిపెద్ద కారణమని నిపుణులు చెబుతున్నారు. భారతదేశం, ప్రపంచంలోని అనేక ఇతర నగరాల మాదిరిగానే, హైదరాబాద్(Hyderabad) కూడా WHO గాలి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఒక క్యూబిక్ మీటర్ గాలికి 5 మైక్రోగ్రాములుగా ఉంది.

ఆరోగ్య సంరక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చిన్న కణాలు మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనవి. ముక్కు చాలా.. ముతక కణాలను ఫిల్టర్ చేయగలిగినప్పటికీ, సూక్ష్మమైన, అల్ట్రాఫైన్ కణాలు ఊపిరితిత్తులలోకి వెళ్తాయి. అవి అక్కడే ఉంటాయి. లేదంటే.. రక్తప్రవాహంలోకి కూడా వెళతాయి.

IQAir ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2021 ప్రకారం హైదరాబాద్ క్యూబిక్ మీటర్ గాలికి 34.7 మైక్రోగ్రాముల నుండి PM 2.5 స్థాయిలు పెరిగి భారతదేశంలో నాల్గో అత్యంత కలుషితమైన నగరంగా గుర్తించబడింది. 2020 నుంచి 2021 మధ్య 39.4కి చేరింది.

2021లో సగటు పీఎం2.5 క్యూబిక్ మీటరు గాలికి 39.4 మైక్రోగ్రాములు కాగా, డిసెంబర్‌లో అది 68.4కి చేరుకుందని నివేదిక వెల్లడించింది. PM 2.5 గాలి పరిధికి క్యూబిక్ మీటరుకు 12 మైక్రోగ్రాముల వద్ద ఉంది. అయినప్పటికీ, ఇది కూడా WHO నిర్దేశించిన 5 కంటే రెండు రెట్లు ఎక్కువ. నవంబర్ 20, 2020 నుండి నవంబర్ 20, 2021 మధ్య వివిధ భారతీయ నగరాల కాలుష్య స్థాయిని విశ్లేషించారు.

తదుపరి వ్యాసం