తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Winter Season 2022 : అమ్మో.. చలి మెుదలైంది..

Winter Season 2022 : అమ్మో.. చలి మెుదలైంది..

HT Telugu Desk HT Telugu

24 October 2022, 15:50 IST

    • Weather Update : శీతాకాలం మెుదలవుతోంది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. హైదరాబాద్ లో ఇప్పటికే చలి పెరుగుతోంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రంలో చలి పెరుగుతోంది. శీతాకాలం ప్రారంభంలోనే.. విపరీతంగా చలి ఉంది. రాష్ట్ర రాజధానిలో పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగానే ఉంటుంది. గతంలో 19-21 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్న రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇప్పుడు 16 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోయింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Pet Dog Attacked Infant : పెంపుడు కుక్క దాడిలో 5 నెలల పసికందు మృతి, రష్మి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్!

Medak Crime : భర్తను వదిలి ప్రియుడితో సహజీవనం- పిల్లలు గుర్తొచ్చి మహిళ ఆత్మహత్య

Mahabubabad Crime : మంత్రాల నెపంతో దంపతులపై దాడి, మహబూబాబాద్ జిల్లాలో తరచూ దారుణాలు!

Mlc Kavitha Remand : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, మే 20 వరకు రిమాండ్ పొడిగింపు

హైదరాబాద్‌(Hyderabad)లోని భారత వాతావరణ విభాగం ( ఐఎండీ ) ప్రకారం, ఆదివారం రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఇలానే మరికొద్ది రోజులు ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ ( టీఎస్‌డీపీఎస్ ) డేటా ప్రకారం, జీహెచ్‌ఎంసీ(GHMC) పరిధిలోని రాజేంద్రనగర్‌లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని న్యాల్‌కల్‌లో 13.1 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఇది తెలంగాణ(Telangana)లో అత్యల్పంగా ఉంది . రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో కూడా 14 నుంచి 15 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. IMD హైదరాబాద్ సూచన ప్రకారం.. వచ్చే వారం నగరం, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో పొడి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ, రాత్రి సమయ ఉష్ణోగ్రత ఒకటి లేదా రెండు పాయింట్లు తగ్గే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం