తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tpcc New Committees : టీపీసీసీ కొత్త కమిటీలు.. ఆయన పేరెక్కడ? ఇక వదిలించుకున్నట్లేనా?

TPCC New Committees : టీపీసీసీ కొత్త కమిటీలు.. ఆయన పేరెక్కడ? ఇక వదిలించుకున్నట్లేనా?

HT Telugu Desk HT Telugu

10 December 2022, 23:04 IST

    • Congress New Committee : టీపీసీసీ కొత్త కమిటీలను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. అయితే ఇందులో ఇన్ని రోజులుగా ఉన్న.. స్టార్ క్యాంపెయినర్ పేరు ఎక్కడా లేదు. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశమైంది.
టీపీసీసీ కొత్త కమిటీలు
టీపీసీసీ కొత్త కమిటీలు

టీపీసీసీ కొత్త కమిటీలు

హస్తం పార్టీ తెలంగాణ కొత్త కమిటీలను ప్రకటించింది. అయితే ఇందులో ఇన్ని రోజులు స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు మాత్రం ఎక్కడా కనిపించలేదు. 18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిగం ఠాగూర్.. ఇన్ఛార్జిగా ఉన్నారు. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులు. 22 మంది సభ్యులు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ఉన్నారు. ఈ సభ్యుల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆయనను పక్కన పెట్టిసిందా అని అందరూ మాట్లాడుకుంటున్నారు.

పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మాణిగం ఠాగూర్ ఛైర్మన్ గా ఉన్నారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, వీహెచ్, పొన్నాల, ఉత్తమ్, జానా రెడ్డి, జీవన్ రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర్ రాజ నర్సింహ, రేణుకాచౌదరి, బలరాంనాయక్, మధుయాష్కీ, చిన్నారెడ్డి, శ్రీధర్ బాబు, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ సభ్యులు. అజారుద్దీన్, అంజన్ కుమార్, జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్లు.. ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు.

ఇక రేవంత్ రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేసింది అధిష్టానం. ఇందులో మల్లు భట్టి విక్రమార్క, వీహెచ్, రేణుకాచౌదరి, దామోదర్ సి రాజనరిసహం, పి.బలరాంనాయక్, నాగ జనార్థన్... మెుత్తం 23మంది ఉన్నారు. జనరల్ సెక్రటరీలుగా 84 మందిని నియమించారు. ఇక తాజాగా ప్రకటించిన కమిటీల్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల మునుగోడు ఉపఎన్నికల సమయంలో ఆయన తీరుపై అధిష్టానం గరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే విషయంపై షోకాజు నోటీసు కూడా జారీ చేసింది. రేవంత్ రెడ్డితో మెుదటి నుంచి ఆయన అంటిముట్టనట్టుగానే ఉన్నారు. మరోవైపు పెండింగ్ లో ఉన్న 26 జిల్లాలకు పార్టీ అధ్యక్షుల్ని సైతం ప్రకటించింది అధిష్టానం.

భద్రాద్రి కొత్తగూడెం-పొడెం వీరయ్య

హనుమకొండ- ఎన్.రాజేందర్‌రెడ్డి

హైదరాబాద్-సమీర్

జగిత్యాల-ఎ.లక్ష్మణ్ కుమార్

జోగులాంబ గద్వాల్-పటేల్ ప్రభాకర్‌రెడ్డి

కామారెడ్డి-కైలాస్ శ్రీనివాస్

ఖైరతాబాద్-సీ.రోహిన్‌రెడ్డి

మహబూబాబాద్-జె.భరత్‌చంద్రారెడ్డి

మహబూబ్‌నగర్-మధుసూదన్‌రెడ్డి

మంచిర్యాల-కె.సురేఖ

మెదక్-తిరుపతిరెడ్డి

మేడ్చల్ మల్కాజిగిరి-నందికంటి శ్రీధర్

నాగర్‌కర్నూలు-కుమారస్వామి

నల్గొండ-శంకర్ నాయక్

నారాయణపేట-శ్రీహరి ముదిరాజ్‌

నిర్మల్-ప్రభాకర్‌రెడ్డి

నిజామాబాద్-మానాల మోహన్‌రెడ్డి

పెద్దపల్లి-ఎంఎస్ రాజ్‌ ఠాకూర్

రాజన్న సిరిసిల్ల-ఆది శ్రీనివాస్

సిద్ధిపేట-టి.నర్సారెడ్డి

వనపర్తి-ఎం.రాజేందర్ ప్రసాద్ యాదవ్

యాదాద్రి భువనగిరి-కె.అనిల్ కుమార్

కాంగ్రెస్ కొత్త కమిటీలు
తదుపరి వ్యాసం