తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vikarabad Crime : వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది, మహిళ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ

Vikarabad Crime : వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది, మహిళ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ

HT Telugu Desk HT Telugu

20 January 2024, 19:08 IST

    • Vikarabad Crime : వికారాబాద్ జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందన్న అనుమానంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తే ఆమెను హత్య చేశాడు.
వికారాబాద్ లో మహిళ హత్య
వికారాబాద్ లో మహిళ హత్య

వికారాబాద్ లో మహిళ హత్య

Vikarabad Crime : వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం వికారాబాద్ మండలం పుల్ మద్ది గ్రామ శివారులో కాలిపోయిన గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. వేరొకరితో సన్నిహితంగా ఉంటుందన్న అనుమానంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తే ఆమెను హత్య చేసి, అనుమానం రాకుండా కాల్చి వేశాడని పోలీసుల విచారణలో తేలింది.

ట్రెండింగ్ వార్తలు

Yadadri Temple : యాదాద్రిలో 'ప్లాస్టిక్' పై నిషేధం - భక్తుల డ్రెస్ కోడ్ పై కీలక నిర్ణయం...!

Kakatiya University VC : కేయూ వీసీపై విజిలెన్స్ విచారణ - సర్కార్ ఆదేశాలు

TS SET 2024 Updates : తెలంగాణ సెట్ దరఖాస్తులు ప్రారంభం - ఆగస్టు 28 నుంచి పరీక్షలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

చీర కొంగుతో మెడకు ఉరి బిగించి

వికారాబాద్ మున్సిపాలిటీలోని చిట్టెంపల్లికి చెందిన అవుసుపల్లి బాబు అనే వ్యక్తి థరూర్ మండలం రాజాపూర్ కు చెందిన యువతిని వివాహం చేసుకొని ఇల్లరికం వచ్చాడు. పెళ్లైన సంవత్సరం వరకు సంతోషంగానే ఉన్నారు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో వారు విడిపోయారు. ఈ క్రమంలో బాబు పటాన్ చెరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ట్యాంకరు డ్రైవర్ గా పనిచేసుకుంటూ, తెల్లాపూర్ లో ఒక గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన అనసూయ(33) నాలుగు సంవత్సరాల కిందట తన భర్త మరణించగా, ఆమె కూడా తెల్లాపూర్ పరిధిలో నివసిస్తుంది. ఈ క్రమంలో బాబుకు, అనసూయకు మధ్య పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. వారు మూడు సంవత్సరాలుగా వివాహేతర సంబంధo కొనసాగిస్తున్నారు. ఈ పరిచయంతో బాబు, అనసూయకు కొంత డబ్బు ఇచ్చాడు. మరల ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవంతో పాటు, అనసూయ ఈ మధ్య వేరొకరితో సన్నిహితంగా ఉంటుందని భావించిన బాబు ఆమెని ఎలాగైనా చంపాలని ప్లాన్ వేశాడు. ఈ నెల 14న బాబు బయటకు తీసుకెళ్తానని చెప్పి అనసూయను వికారాబాద్ మండలం పుల్ మద్ది గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో గొడవ పడి తలపై కొట్టాడు. ఆ తర్వాత ఆమె చీర కొంగుతో మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు తీసుకొని, అనుమానం రాకుండా మృతదేహంపై నిప్పంటించి పారిపోయాడు.

నేరం చేసినట్లు అంగీకరించడంతో

అప్పుడు ఈ మృతదేహం అనసూయదే అని అనుమానం ఉన్న పోలీసులు, వికారాబాద్ ఎస్పీ ఆదేశాల మేరకు ఆరు బృందాలుగా ఏర్పడి, ఆమె ఫొటోలను సమీప పోలీస్ స్టేషన్లకు పంపారు. అప్పటికే చేవెళ్ల పోలీస్ స్టేషన్లో అనసూయ అదృశ్యంపై ఫిర్యాదు అందడంతో, ఆమె కుటుంబసభ్యులను అక్కడికి పిలిపించారు. వారు ఫొటోను చూసి హత్యకు గురైయింది అనసూయేనని నిర్ధారించారు. ఈ క్రమంలో బాబుకు, ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్టు పోలీసులకు తెలిపారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 18న బాబును తెల్లాపూర్ లో అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల విచారణ అతడే నేరం చేసినట్లు అంగీకరించడంతో అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

రిపోర్టింగ్ : మెదక్ ప్రతినిధి, హెచ్.టి.తెలుగు

తదుపరి వ్యాసం