తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vikarabad Nursing Student Case : నర్సింగ్ విద్యార్థిని కేసులో వీడని మిస్టరీ, కీలకంగా మారిన పోస్టుమార్టం రిపోర్టు!

Vikarabad Nursing Student Case : నర్సింగ్ విద్యార్థిని కేసులో వీడని మిస్టరీ, కీలకంగా మారిన పోస్టుమార్టం రిపోర్టు!

12 June 2023, 15:10 IST

    • Vikarabad Nursing Student Case : వికారాబాద్ నర్సింగ్ విద్యార్థిని శిరీష్ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. యువతిపై అత్యాచారం జరిగిందా? లేదా? గుర్తించేందుకు మరోసారి పోస్టుమార్టం నిర్వహించారు వైద్యులు.
నర్సింగ్ విద్యార్థి శిరీష
నర్సింగ్ విద్యార్థి శిరీష

నర్సింగ్ విద్యార్థి శిరీష

Vikarabad Nursing Student Case : వికారాబాద్‌ జిల్లా కాళ్లాపూర్‌ నర్సింగ్ విద్యార్థిని శిరీష్ హత్య కేసులో మిస్టరీ వీడలేదు. శిరీష హత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. యువతి బావతో సహా మరికొంత మందిని పోలీసులు విచారిస్తున్నారు. శనివారం రాత్రి శిరీష ఇంట్లో జరిగిన గొడవపై పోలీసులు ఆరా తీస్తున్నారు. యువతి చేతులు, కాళ్లపై బ్లేడుతో కోసినట్లు గుర్తించారు. శిరీష మృతదేహానికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. యువతిపై అత్యాచారం జరిగిందా? లేదా? అనే కోణంలో పరీక్షలు చేస్తున్నారు. శిరీష కళ్లకు గాయాలవ్వడానికి...నీటికుంటలో పడినపుడు రాళ్లు గుచ్చుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీంతో పోస్టుమార్టం నివేదిక చాలా కీలకంగా మారింది. అయితే శిరీషను హత్య చేసిందెవరో ఆమె తండ్రికి తెలుసని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

రెండోసారి పోస్టుమార్టం

శిరీష మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు... ఏంతేల్చలేకపోయారు. శిరీష హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కాండ్లాపూర్‌ గ్రామస్తులు నిరసనకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అంతకు ముందు గ్రామస్తులు శిరీష తండ్రిపై దాడికి పాల్పడ్డారు.

శిరీషను హత్య చేసినట్లు ఆధారాలున్నా, వాస్తవాల్ని బయటపెట్టాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. శిరీష చేతులు, కాళ్లపై బ్లేడుతో కోసిన గాయాలు ఉండడంతో ఎవరో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యాచారం జరిగిందా? అనే అనుమానంతో శిరీష మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం చేశారు.

గ్రామస్థులు ఆందోళన

నీటిగుంటలో యువతి కళ్లకు కట్టెలు లేదంటే రాళ్లు గుచ్చుకుని గాయాలు అయ్యిండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. యువతి పోస్టుమార్టం రిపోర్టును ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించామన్నారు. అయితే అత్యాచారం జరిగిందా? అనేదానిపై వైద్యులు స్పష్టత ఇవ్వలేదు. పోస్టుమార్టమ్ రిపోర్ట్‌ వస్తే గానీ వాస్తవాలు తెలియవన్నారు. ఈ కేసును పక్కదారి పట్టించేందుకు శిరీష బంధువులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో రేపు మరొకరికి ఇలాంటి పరిస్థితి ఎదురుకాదనే గ్యారెంటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని గ్రామస్థులు అంటున్నారు.

అసలేం జరిగింది?

వికారాబాద్ జిల్లాలో అత్యంత దారుణ రీతిలో యువతి హత్యకు గురైంది. శనివారం రాత్రి ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లి యువతి దారుణ పరిస్థితిలో విగతజీవిగా లభ్యమైంది. యువతి కాళ్లు, చేతులపై బ్లేడ్ గాయాలు, కళ్లు పెకలించిన స్థితిలో యువతి మృతదేహం దొరికింది. యువతిని హత్య చేసిన అనంతరం నీటి కుంటలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి మృతదేహాన్ని నీటి కుంటలో గుర్తించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. 19 ఏళ్ల శిరీష ఇంటర్ పూర్తి చేసుకుని నర్సింగ్ కోర్సులో చేరింది. ఇంటి శిరీష హత్యకు గురైందన్న సమాచారంతో గ్రామంలో విషాదం అలముకుంది.

తదుపరి వ్యాసం