తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Fighter Rooster Auction In Karimnagar : సజ్జనార్ సార్... ఆ పందెం కోడి నాదే, దయచేసి బహిరంగ వేలం ఆపండి

Fighter rooster Auction in Karimnagar : సజ్జనార్ సార్... ఆ పందెం కోడి నాదే, దయచేసి బహిరంగ వేలం ఆపండి

12 January 2024, 16:21 IST

    • TSRTC Fighter rooster Auction : ఇటీవలే కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సులో పందెం కోడి దొరికిన ఘటనలో వరుస ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం వేలం వేసేందుకు ఆర్టీసీ అధికారులు రంగం సిద్ధం చేయగా… ఆ కోడి నాదే అంటూ ఓనర్ ఓ వీడియోను వదిలాడు.
కోడి వేలంలో ట్విస్ట్
కోడి వేలంలో ట్విస్ట్

కోడి వేలంలో ట్విస్ట్

TSRTC Fighter rooster Auction : ఇటీవలే ఓ ఆర్టీసీ బస్సులో పందెం కోడి దొరికింది. అయితే కోడికి సంబంధించిన వ్యక్తులు ఎవరూ లేకపోవటంతో… ఆ కోడిని డిపోకు తీసుకెళ్లారు అధికారులు. అయితే కోడి దొరికి మూడు రోజులు గడవటంతో… అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. జనవరి 12వ తేదీన కోడిని వేలం వేస్తున్నట్లు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, విచారణ పరిధి జూబ్లీహిల్స్ పీఎస్ కు మార్పు

Mlc Kavitha Remand : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, జూన్ 3 వరకు రిమాండ్ పొడిగింపు

Hyderabad Fish Prasadam : జూన్ 8, 9 తేదీల్లో చేప మందు పంపిణీ, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాట్లు

Do Dham IRCTC Tour Package : కేదార్ నాథ్, బద్రీనాథ్ దో ధామ్ యాత్ర- 7 రోజుల ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే!

ప్రకటనలో ఏముందంటే…?

కోడి వేలానికి సంబంధించి జనవరి 11వ తేదీన కరీంనగర్ 2 డిపో అధికారులు ప్రకటన విడుదల చేశారు. జనవరి 9వ తేదీన ఓ పందెం కోడిని ఆర్టీసీ బస్సులో మరిచిపోయారని ప్రకటించారు. ఈ కోడిని తీసుకెళ్లేందుకు మూడు రోజులుగా ఎవరూ రాలేదని... ఈ నేపథ్యంలో పందెం కోడిని అంబేడ్కర్ బస్ట్ స్టేషన్ ఆవరణలో వేలం వేస్తున్నట్లు తెలియజేశారు. ఆసక్తిగలవారు బహిరంగ వేలంలో పాల్గొని దక్కించుకోవచ్చని తెలిపారు.

పందెం కోడిని వేలం వేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ఇచ్చిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. అంతేకాదు… ఈ ప్రకటనతో పాటు మొత్తం ఎపిసోడ్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే నిబంధనల ప్రకారం లాస్‌ ఆఫ్‌ ప్రాపర్టీ కింద మరిచిపోయిన వస్తువుల గురించి సరైన ఆధారాలతో ఎవరూ రాకపోతే 24 గంటల తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేలం పాట నిర్వహించాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే… ఈ పందెం కోడిని వేలం వేయడానికి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

సీన్ లోకి ఓనర్…!

పందెం కోడి వేలం ముచ్చట టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ గా మారిపోయింది. వేలానికి సమయం దగ్గర పడిన వేళ… సజ్జనార్ సార్ ఆ కోడి నాదే అంటూ ఓనర్ ఎంట్రీ ఇచ్చాడు. ఓ వీడియోను విడుదల చేశాడు. కరీంనగర్ ఆర్టీసీ బస్సులో దొరికిన కోడి తనదే అని చెప్పాడు. తనది నెల్లూరు జిల్లా అని చెప్పిన మహేశ్… బతుకుతెరువు కోసం రుద్రంగికి వచ్చినట్టుగా వీడియోలో వివరించాడు. రుద్రంగి నుంచి కరీంనగర్ మీదుగా నెల్లూరు వెళ్ళే క్రమంలో తెల్లవారుజామున నిద్రమత్తులో కరీంనగర్ బస్టాండ్ బస్ దిగి కోడిని మర్చిపోయానంటూ చెప్పుకొచ్చాడు. పందెంకోడి వేలాన్ని నిలిపివేయాలని డిపో మేనేజర్ ని కోరానని తెలిపాడు. బస్సులో ప్రయాణించిన టికెట్ కూడా తన వద్ద ఉందని చెప్పాడు. కోడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా తన వద్ద ఉన్నాయని… దయచేసి కోడి వేలాన్ని ఆపాలని కోరాడు.

ఓనర్ సీన్ లోకి రావటం ఆర్టీసీ అధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. అయితే వేలాన్ని ఆపుతారా..? లేదా…? అనేది ఉత్కంఠగా మారింది.

తదుపరి వ్యాసం