తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy: రైతుల ఉప్పెనలో టీఆర్ఎస్ ను కమ్మేయాలి

Revanth reddy: రైతుల ఉప్పెనలో టీఆర్ఎస్ ను కమ్మేయాలి

HT Telugu Desk HT Telugu

29 April 2022, 14:56 IST

    • నాగార్జున సాగర్‌‌లో కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మే 6వ తేదీన వరంగల్ లో రైతులు ఉప్పెన సృష్టించాలని పిలుపునిచ్చారు.
నాగార్జున సాగర్‌‌లో కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం
నాగార్జున సాగర్‌‌లో కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం

నాగార్జున సాగర్‌‌లో కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం

వరంగల్ గడ్డపై తలపెట్టిన రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నాగార్జున సాగర్‌‌లో కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశంలో ప్రసంగించిన ఆయన... టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను ఏడాదిన్నరలో  పూర్తి చేస్తామని చెప్పిన వాళ్లు... కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదని ధ్వజమెత్తారు. జిల్లాలోని మంత్రులు ఇసుక దందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మర్డర్ లు, దోపిడీలు, అవకతవకలతో ప్రభుత్వంలోని మంత్రులంతా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ పరిస్థితుల్లో నల్గొండ జిల్లా బిడ్డలు మరో పోరాటానికి సిద్ధం కావాలన్నారు.

ట్రెండింగ్ వార్తలు

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

'నల్గొండ జిల్లా నుంచి ఎంతో మంది గొప్ప నేతలు ఉన్నారు. సాయుధ పోరాటం నడిచిన గడ్డ ఇది. గొప్పగొప్ప రాజకీయ నేతలకు అందించిన నేల. ఇలాంటి నల్గొండ జిల్లాలోని బిడ్డలు మరో పోరాటానికి సిద్ధం కావాలి. మే 6న వరంగల్ వేదికగా తలపెట్టిన రైతు సంఘర్షణ సభకు ఉప్పెనలా తరలిరావాలి. ఈ ఉప్పెనలో టీఆర్ఎస్ ను కమ్మేయాలి' - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఢిల్లీలో మోడీ.. గల్లీలో కేడీ..

కేంద్రంలో మోడీ... గల్లీలోని కేడీ కలిసి వరి ధాన్యంపై డ్రామాలు ఆడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు కాకుండా రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఎవరు కొనాలని ప్రశ్నించారు. వరి వేయవద్దని చెప్పిన కేసీఆర్.. తన ఫామ్ హౌజ్ లో 150 ఎకరాల్లో వరిని పండించారని గుర్తు చేశారు. ఈ వరిని ఎవరు కొంటారో.. వారే రైతులు పండించిన వరిని కూడా కొనాలని నాడు హెచ్చరించామని గుర్తు చేశారు. కల్లాల వద్దకు కాంగ్రెస్ పేరుతో పోరాటం చేశామన్నారు. రైతుల సమస్యలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లామన్న రేవంత్.. రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించామన్నారు. వరి కొనకపోతే ఉరి వేస్తామని హెచ్చరించటంచో ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. అబద్ధాల పునాదుల మీద గెలిచిన టీఆర్ఎస్ సర్కార్ కు బుద్ధి చెప్పాల్సిన సమయం అసన్నమైందని వ్యాఖ్యానించారు.

జానారెడ్డి రింగ్ మాస్టర్ - రేవంత్ రెడ్డి

సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి... సీనియర్ నేత జానారెడ్డిపై ప్రశంసలు కురిపించారు. చట్టసభలకే గౌరవం తెచ్చిన వ్యక్తి జానారెడ్డి అని గుర్తు చేశారు. ఉప ఎన్నికలో ఓడిపోయినప్పటికీ... ఆయన గౌరవం ఎక్కడా తగ్గలేదన్నారు. తమని కొందరు పులులు, సింహాలు అని అంటున్నారని.. కానీ వాటిని కంట్రోల్ చేసే రింగ్ మాస్టర్ మాత్రం జానారెడ్డే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ సమస్య వచ్చినా పరిష్కరించే వ్యక్తి ఆయనే అని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా పార్టీ సభ్యత్వాలు చేసిన ఘనత నల్గొండ పార్లమెంట్ సొంతం చేసుకుందని చెప్పుకొచ్చారు.

ఉత్తమ్ హాజరు.. కోమటిరెడ్డి బ్రదర్స్ డుమ్మా..

నల్గొండ సన్నాహక సమావేశంపై మొదట్నుంచి ఆసక్తి నెలకొంది. ఎంపీ కోమటిరెడ్డి రాలేనని చెప్పగా.. ఉత్తమ్ కూడా హాజరుపై స్పష్టత లేదు. అయితే ఇవాళ్టి సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ డుమ్మా కొట్టారు. మాజీ మంత్రులు గీతారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి హాజరయ్యారు. ఇక పీసీసీ హోదాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలిసారిగా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. వేదికపై కాబోయే సీఎం రేవంత్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.

తదుపరి వ్యాసం