తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sankranti Traffic: పండుగ ప్రయాణాలతో టోల్‌ప్లాజాల్లో ట్రాఫిక్

Sankranti Traffic: పండుగ ప్రయాణాలతో టోల్‌ప్లాజాల్లో ట్రాఫిక్

Sarath chandra.B HT Telugu

12 January 2024, 12:36 IST

    • Sankranti Traffic: సంక్రాంతి పండుగకు నగరాల నుంచి ప్రజలు గ్రామాల బాట పట్టారు. సొంతూళ్లకు వెళ్లే వారితో టోల్‌ప్లాజాలు రద్దీగా మారాయి. హైవేలపై వాహనాల సంఖ్య పెరిగి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. 
టోల్‌ ప్లాజాల్లో పెరిగిన ట్రాఫిక్ రద్దీ
టోల్‌ ప్లాజాల్లో పెరిగిన ట్రాఫిక్ రద్దీ

టోల్‌ ప్లాజాల్లో పెరిగిన ట్రాఫిక్ రద్దీ

Sankranti Traffic: సంక్రాంతి పండుగకు వెళ్లే వాహనాలతో హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింద.ి

సంక్రాంతి సందర్బంగా 65వ నంబరు జాతీయ రహదారి హైదరాబాద్-విజయవాడ వైపు వాహనాల రద్దీ పెరిగింది. పంతంగి, కొర్లపహాడ్, మాడ్గులపల్లి వద్ద వాహనాలు బారులు తీరాయి. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు పదిగేట్లతో వాహనాలను అనుమతిస్తున్నారు. టోల్ బూత్‌లను పెంచి టోల్ సిబ్బంది టోల్‌ సిబ్బంది ఏర్పాటు చేశారు.

విజయవాడ-హైదరాబాద్ హైవేపై పెరిగిన వాహనాల రద్దీ పెరగడంతో విజయవాడ వైపు 10 కౌంటర్లు, హైదరాబాద్ వైపు 4 కౌంటర్లు ఏర్పాటు చేవారు. కొర్లపహాడ్ టోల్ ప్లాజాలో వియవాడ వైపు 8 కౌంటర్లు తెరిచారు. శుక్రవారం నుంచి పండగ సెలవులు కావడంతో ప్రజలు నగరం నుంచి పల్లెబాట పట్టారు.

ఏపీ వైపు వెళ్లే వాహనాలతో హైవేపై రద్దీ నెలకొంది. చౌటుప్పల్‌ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌తోపాటు పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. రద్దీ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

పంతంగి వద్ద టోల్‌ ప్లాజా దాటేందుకు సుమారు ఇరవై నిమిషాలకు సమయం పడుతోంది. పంతంగిలో 18 టోల్‌ బూత్‌లు ఉండగా విజయవాడ మార్గంలోనే 10 బూత్‌లను తెరిచి వాహనాలను పంపిస్తున్నారు. పొగమంచు నేపథ్యంలో ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ నిదానంగా వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు.

హైదరాబాద్‌ నుంచి స్వస్థలాలకు కార్లు, ఇతర వాహనాల్లో భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారు. తెలంగాణలోని పంతంగి, కొర్లపహాడ్‌, ఏపీలోని చిలకల్లు, కీసర టోల్‌ ప్లాజాల వద్ద తీవ్ర రద్దీ నెలకొని వాహనదారులు చాలా సేపు వేచి చూడాల్సి వస్తోంది. శుక్రవారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు రావడంతో రద్దీ మొదలైంది.

హైదరాబాద్‌- విజయవాడ జాతీయరహదారి మొత్తం 273 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. పంతంగి టోల్‌గేట్‌ వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోంది. పంతంగి టోల్‌గేట్‌ వద్ద 16 టోల్‌ చెల్లింపు కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు మొదటి టోల్‌గేట్‌ పంతంగిదే వస్తుంది. దీంతో ఇక్కడ టోల్‌ చెల్లించడానికి వాహనాలు ఎక్కువ సేపు ఆగాల్సి వస్తోంది.

పంతంగి దాటిన తర్వాత నార్కట్‌పల్లి నుంచి కొన్ని వాహనాలు మిర్యాలగూడ మీదుగా అద్దంకి, చెన్నై వైపు వెళ్తాయి. కొర్లపహాడ్‌ టోల్‌గేట్‌ దాటాక మరికొన్ని వాహనాలు ఉమ్మడి ఖమ్మం వైపు, మిగతావి విజయవాడ వైపు బయలుదేరుతాయి. వాహనాలు ఇలా మూడు దారుల వైపు వెళ్తుండటంతో ట్రాఫిక్‌ జామ్‌ మిగితా రెండు టోల్‌ప్లాజాలలో కాస్త తగ్గుతోంది.

తిరుగు ప్రయాణంలో కూడా మూడు ప్రాంతాల వైపు నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్‌కు వెళ్లాలంటే పంతంగి టోల్‌గేట్‌ మీదుగానే వెళ్లాల్సి ఉంది. దీంతో ఇక్కడ వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ప్రస్తుతం పంతంగిలో 65వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. శనివారం అర్థరాత్రి వరకు రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

తదుపరి వ్యాసం