తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Group 1 : ఈనెల 16న గ్రూప్ - 1 ప్రిలిమ్స్ పరీక్ష... 9 నుంచి హాల్ టికెట్లు!

TSPSC Group 1 : ఈనెల 16న గ్రూప్ - 1 ప్రిలిమ్స్ పరీక్ష... 9 నుంచి హాల్ టికెట్లు!

HT Telugu Desk HT Telugu

07 October 2022, 12:34 IST

    • TSPSC Group 1 Hall Ticket 2022: అక్టోబర్ 16 న తెలంగాణ గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 9వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అక్టోబర్ 16న గ్రూప్ 1 ఎగ్జామ్ !
అక్టోబర్ 16న గ్రూప్ 1 ఎగ్జామ్ !

అక్టోబర్ 16న గ్రూప్ 1 ఎగ్జామ్ !

TSPSC Group1 Preliminary Test 2022: తెలంగాణ గ్రూప్-1 ప‌రీక్షకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబరు 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనుంది. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లలో నిమగ్నమైంది. నిజానికి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను జూలై నెలలోనే నిర్వహిచాలి.. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు ఉండటంతో అప్పట్లో వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

Graduate Mlc Election: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై బీజేపీ గురి, కీలక నేతలకు ఇన్‌ఛార్జి బాధ్యతలు

Warangal Rains: వరంగల్‌లో ఈదురు గాలులతో భారీ వర్షం, రైతులకు తీవ్ర నష్టం.. గ్రేటర్ లో ఆఫీసర్లు అలర్ట్

CM Revanth Reddy : తెలంగాణలో భూముల మార్కెట్ విలువ సవరణ…! కీలక ఆదేశాలు జారీ

TS LAWCET 2024 Updates : టీఎస్ లాసెట్ కు భారీగా దరఖాస్తులు - ఈ సారి 3 సెష‌న్ల‌లో ఎగ్జామ్, ఫైన్ తో అప్లికేషన్లకు ఛాన్స్

తెలంగాణ గ్రూప్ -1 పరీక్షకు సంబంధించి మొత్తం 503 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇందుకోసం మొత్తం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 756 మంది చొప్పున పోటీపడుతున్నారు. గ్రూప్-1 ప్రకటనలో మొత్తం 503 పోస్టుల్లో మహిళలకు 225 రిజర్వు అయ్యాయి. వీటికి 1,51,192 మంది దరఖాస్తు చేయగా.. ఒక్కో పోస్టుకు సగటున 672 మంది పోటీపడుతున్నారు.

9 నుంచి హాల్ టికెట్లు...

TSPSC Group - 1 Hall Ticekts 2022: గ్రూప్ 1 కు సంబంధించిన హాట్ టికెట్లు అక్టోబర్ 9 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు పొందవచ్చని టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష నిర్వహణ కోసం 1040 సెంటర్లను ఏర్పాటు చేశారు.

మొత్తం గ్రూప్‌ –1 పోస్టులు - వివరాలు

ఎంపీడీవో- 121

జిల్లా బీసీ అభివద్ధి అధికారి– 2

అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌– 40

అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌– 38

అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(వైద్యారోగ్యశాఖ)– 20

డీఎస్పీ– 91

జైల్స్‌ డిప్యూటీ సూపరిండెంట్‌– 2

అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌– 8

డిస్ట్రిక్ట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్‌– 2

జిల్లా మైనారీటీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌– 6

మునిసిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ (2) - 35

డీపీవో- 5

కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌- 48

డిప్యూటీ కలెక్టర్‌- 42

అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరిండెంట్‌- 26

జిల్లా రిజిస్ట్రార్‌- 5

జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌- 3

ఆర్టీవో- 4

జిల్లా గిరిజన సంక్షేమాధికారి- 2

రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 పోస్టులను మెుదటిసారిగా భర్తీ చేస్తున్నందున అభ్యర్థుల నుంచి భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాలు తదితర వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని టీఎస్పీఎస్సీ సూచించింది. గ్రూప్‌ 1 మెయిన్స్ పరీక్షలు 2023 జనవరిలో లేదా ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు.

NOTE:

లింక్ పై క్లిక్ చేసి హాట్ టికెట్లు, గ్రూప్ 1 సంబంధిత అప్డేట్స్ చెక్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం