తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Greater City Corporation : విలీనం దిశగా అడుగులు...! తెరపైకి 'హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్'

Hyd Greater City Corporation : విలీనం దిశగా అడుగులు...! తెరపైకి 'హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్'

HT Telugu Desk HT Telugu

03 March 2024, 10:00 IST

    • Hyderabad Greater City Corporation: గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు,  మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేయాలని చూస్తోంది.
హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్
హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ (https://www.hmda.gov.in/)

హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్

Hyderabad Greater City Corporation: తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన రోజు నుంచే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ( HMDA) పరిధిలో ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు అలాగే మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. హెచ్ఎండిఏ పరిధిలోని ప్రాంతాలన్నీ కలిపి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం లేదా నాలుగు వైపులా నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ ఆలోచిస్తుంది. 

ట్రెండింగ్ వార్తలు

Karimnagar Rains : అకాల వర్షాలు, తడిసిపోయిన ధాన్యం..! అన్నదాత ఆగమాగం

TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ హాల్ టికెట్లు విడుద‌ల‌ - డౌన్లోడ్ లింక్ ఇదే

Hyderabad Crime : బీమా డబ్బుల కోసం కోడలి దాష్టీకం..! అత్తమామల హత్యకు కుట్ర, కత్తులతో దాడి చేసిన సుఫారీ గ్యాంగ్

BRS Mlc Election Burden: బీఆర్​ఎస్ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ భారమంతా ‘పల్లా’పైనే! సహకరించని గులాబీ​ నేతలు

ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు అలాగే 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. ఇలా సాధ్యం కానీ పరిస్థితిలో నాలుగు వైపులా ఈస్ట్, వెస్ట్ ,నార్త్ ,సౌత్ పేరిట నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనల పైన తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది.

GHMC లో విలీనం....?

మరోవైపు కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లను జనాభా ప్రతిపదికన ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. అన్ని డివిజన్లో సమానంగా జనాభా ఉండేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నియోజకవర్గం సరిహద్దులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటుగా కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్ లకు అసమానత నిధులు అందుతున్నాయని విమర్శలు ఉన్నాయి. కొన్ని డివిజన్లో లక్ష మంది జనాభా ఉండగా మరికొన్ని చోట్ల కేవలం 30 వేల మంది వరకే ఉంటున్నారు.ఈ నేపథ్యంలో మౌలిక వసతుల కల్పన కోసం కేటాయించి నిధులు అధిక జనాభా ఉన్న చోట,తక్కువ జనాభా ఉన్న చోట ఒకే తిరుగా కేటాయిస్తే కొన్ని ప్రాంతాలకు లాభం జరిగి కొన్ని ప్రాంతాలు నష్టపోతున్నాయని ప్రభుత్వం భావిస్తుందు. అందుకే సమానంగా జనాభా ఉండేలా డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనివల్ల గ్రేటర్ హైదరాబాద్ సిటీని ఒకే తీరుగా అభివృద్ధి చేసేందుకు ఈ విలీనం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది.

డిల్లీ విధానం అమలు….!

ఇకపోతే ఇప్పుడున్న కార్పొరేషన్ లో మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన వెంటనే వాటికి ప్రత్యేక అధికారులు నియమించాలని రేవంత్ సర్కార్ ఆదేశించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాతే విలీన ప్రక్రియపై ముందుకు వెళ్లాలని మున్సిపల్ అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇలా అయితే న్యాయపరమైన ఇబ్బందులు ఉండవు అని ప్రభుత్వం భావిస్తుంది.ఇదే సమయంలో ఢిల్లీ తరహా విధానాన్ని అవలంబించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. ఢిల్లీలో గతంలో మూడు మున్సిపల్ కార్పొరేషన్ ఉండగా....రెండేళ్ల క్రితం వాటిని ఒకే కార్పొరేషన్ గా విలీనం చేశారు. ఆ విధానాన్ని ఇక్కడ కూడా అనుసరించేందుకు ప్రభుత్వం అధికారులతో సమాలోచనలు చేస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి విలీనం జరిగిన తీరు అందుకు అనుసరించిన విధానాలను మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి రివ్యూ మీటింగ్ లో రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.

రిపోర్టింగ్: కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

తదుపరి వ్యాసం