తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Temple Tickets Online : ఆలయాల్లో ఆన్ లైన్ సేవలు.. ఇంట్లో నుంచే టెంపుల్ టికెట్ బుకింగ్

Temple Tickets Online : ఆలయాల్లో ఆన్ లైన్ సేవలు.. ఇంట్లో నుంచే టెంపుల్ టికెట్ బుకింగ్

HT Telugu Desk HT Telugu

28 February 2023, 16:40 IST

    • Temple Tickets Online : రాష్ట్రంలోని 36 ఆలయాల్లో ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. దర్శనం సహా ప్రత్యేక సేవల టికెట్లను టీ యాప్ ఫోలియో మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది. టెంపుల్స్ లో టెక్నాలజీని పెంచుతూ... కియోస్క్ లను కూడా ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది.
ఆలయాల్లో ఆన్ లైన్ సేవలు
ఆలయాల్లో ఆన్ లైన్ సేవలు (twitter)

ఆలయాల్లో ఆన్ లైన్ సేవలు

Temple Tickets Online : మీరు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఏదైనా ఆలయాన్ని సందర్శించాలని అనుకుంటున్నారా ? కుటుంబ సమేతంగా వెళ్లి ప్రత్యేక పూజలు, సేవల్లో పాల్గొనాలని భావిస్తున్నారా ? ఆయా ఆలయాలకు ఆన్ లైన్ సేవలు ఉంటే.. ఏం చక్కా ఇంట్లో నుంచే దర్శనం సహా ప్రత్యేక సేవల టికెట్లు బుక్ చేసుకునే వాళ్లం కదా అని అనుకుంటున్నారా ? భక్తుల ఈ కోరిక త్వరలోనే తీరనుంది. రాష్ట్రంలోని ఆలయాల సమగ్రాభివృద్ధికి దశల వారీగా చర్యలు చేపడుతున్న ప్రభుత్వం... రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పూజలు, సేవలతోపాటు వసతి సౌకర్యాన్ని ఆన్‌లైన్‌ ద్వారానే బుక్‌ చేసుకునే వీలు కల్పించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ టీ యాప్‌ ఫోలియో మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. తొలి విడతగా రాష్ట్రంలోని 36 ప్రధాన ఆలయాల్లో ఈ మొబైల్‌ యాప్‌ ద్వారానే అన్ని సేవలను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించింది.

ట్రెండింగ్ వార్తలు

Illegal Affair: వివాహేతర సంబంధంతో భర్తను చంపేసి.. కట్టుకథతో అంత్యక్రియలు పూర్తి, మూడ్నెల్ల తర్వాత నిందితుడు లొంగుబాటు

Dogs Killed Goats: కుక్కల దాడిలో మేకల మృతి, మేక కళేబరాలతో మునిసిపల్ కార్యాలయంలో ఆందోళన

Kamareddy DMHO: కామారెడ్డిలో కామపిశాచి, వైద్యులపై వేధింపుల కేసుతో జిల్లా వైద్యాధికారి అరెస్ట్

BRS Protest: బోనస్ బోగసేనా?... రోడ్డెక్కిన బీఆర్ఎస్.. ప్రభుత్వ తీరుపై ధర్నాలు, రాస్తారోకోలతో BRS నిరసన

రాష్ట్రవ్యాప్తంగా 36 ప్రధాన ఆలయాల్లో మొబైల్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆయా ఆలయాల్లో దర్శనం సహా ఇతర సేవల టికెట్లు, వసతిని టీ యాప్ ఫోలియో మొబైల్ యాప్ ద్వారా భక్తులు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. బల్కంపేట ఎల్లమ్మ, వేములవాడ రాజరాజేశ్వర, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, సికింద్రాబాద్‌ మహంకాళి, బాసర సరస్వతి, వరంగల్‌ భద్రకాళి, హైదరాబాద్‌ పెద్దమ్మతల్లి, కొండగట్టు హనుమాన్‌ దేవాలయం, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, కర్మన్‌ఘాట్‌ ఆంజనేయస్వామి, కొమురవెల్లి మల్లికార్జునస్వామి, భద్రాచలం సీతారామచంద్రస్వామి, సికింద్రాబాద్‌ గణేశ్‌ టెంపుల్, వరంగల్‌ రామప్ప, వర్గల్‌ సరస్వతీ, జియాగూడ రంగనాథస్వామి ఆలయాల్లో ఆన్ లైన్ సేవలు కల్పించారు. జాతర, బోనాల సమయాల్లో కూడా ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి. మేడారం జాతర ప్రసాదం కూడా యాప్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు.

ఆలయాల్లో కియోస్క్ లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. భక్తులు త్వరిగతిన టికెట్లు పొందేందుకు వీలుగా.. టెంపుల్స్ లో వీటిని ఇన్ స్టాల్ చేయనున్నారు. ముందుగా బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్‌ గణేశ్‌ టెంపుల్ సహా నగరంలోని ఇతర ప్రధాన ఆలయాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారు. వీటి ద్వారా కలిగే ప్రయోజనాలను అధ్యయనం చేసి... ఫలితాలు బాగుంటే... దశలవారీగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

టీటీడీ యాప్ లో పంచగవ్య ఉత్పత్తులు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తయారు చేస్తున్న 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తేవడంపై దృష్టి సారించింది టీటీడీ. ఉత్పత్తుల గురించి టీటీడీ వెబ్ సైట్ తో పాటు ఇటీవల రూపొందించిన యాప్ లో కూడా సమాచారం పొందుపరచాలని ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. 15 రకాల పంచగవ్య ప్రొడక్ట్స్ లో.. 10 ఉత్పత్తులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. వీటిని మరింత ఎక్కువగా వినియోగదారులకి చేరువచేయడానికి ప్రయత్నించాలని నిర్దేశించారు. ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

తదుపరి వ్యాసం