తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Cpget 2022 : రేపు పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

TS CPGET 2022 : రేపు పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

HT Telugu Desk HT Telugu

25 September 2022, 11:37 IST

    • tscpget counselling 2022:తెలంగాణవ్యాప్తంగా పీజీ కోర్సుల్లో  పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూలు సెప్టెంబ‌ర్ 26వ తేదీన‌ విడుదల చేయనున్నారు. ఈ మేరకు సీపీజీఈసెట్‌–2022 కన్వీనర్‌ ప్రొ.పాండురంగారెడ్డి తెలిపారు.
ఓయూ పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్
ఓయూ పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్ (www.osmania.ac.in)

ఓయూ పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్

Telangana CPGET Counselling 2002: ఉస్మానియా వర్శిటీతో పాటు పాటు రాష్ట్రంలోని ఇతర వర్సిటీల పరిధిలోని 2022–23 విద్యా సంవత్సరానికి పీజీ ప్రవేశాలకు మొదటి విడత ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ సోమవారం(సెప్టెంబర్ 26వ తేదీ) విడుదల కానుంది. వచ్చే వారం నుంచి ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత పొందిన వారు 2022–23 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఈడీ, ఎంపీడీ, ఎంసీజే, లైబ్రరీ సైన్స్‌లతో పాటు ఐదేళ్ల పీజీ, పీజీ డిప్లొమాలో ప్రవేశాలు పొందుతారు.

ఇవి తప్పనిసరిగా..

SSC, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు

ర్యాంక్ కార్డు

టీసీ, కులం, ఆదాయం సర్టిఫికెట్లు తప్పనిసరి

సర్టిఫికెట్లు లేని పక్షంలో అడ్మిషన్‌ తిరస్కరిస్తారు.

ఫలితాలు విడుదల...

TS CPGET Results 2022: టీఎస్‌ సీపీజీఈటీ– 2022 ఫలితాలు సెప్టెంబర్ 16న విడుదలయ్యాయి. ఓయూతో పాటు ఇతర వర్సిటీలలో వివిధ పీజీ, పీజీ డిప్లొమా, 5 ఏళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు నెల 11 నుంచి 23 వరకు జరిగిన ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఓయూ నిర్వహించిన CPGET– 2022లో 45 సబ్జెక్టులకు 67,115 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఓయూతో పాటు తెలంగాణ, తెలంగాణ మహిళ, కాకతీయ, పాలమూరు, శాతా వాహన, జేఎన్టీయూ, మహాత్మాగాంధీ వర్సి టీల్లో పీజీ కోర్సులతో పాటు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఇక.. పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://cpget.tsche.ac.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఇదే లింక్ తో ర్యాంక్ కార్డు పొందవచ్చు.

తదుపరి వ్యాసం