తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Cmo Fb Page: మూగబోయిన తెలంగాణ సిఎంఓ ఫేస్‌బుక్ పేజీ

TS CMO FB Page: మూగబోయిన తెలంగాణ సిఎంఓ ఫేస్‌బుక్ పేజీ

Sarath chandra.B HT Telugu

08 December 2023, 10:12 IST

    • TS CMO FB Page: తెలంగాణలో అధికార మార్పిడి జరిగిన వెంటనే ప్రభుత్వ సోషల్‌ మీడియా ఖాతాలు మూగబోయాయి. ముఖ్యమంత్రి అధికారిక ఫేస్‌బుక్‌ పేజీ దాదాపు వారం రోజులుగా మూగబోయింది. 
డిసెంబర్‌ ఒకటో తేదీ పోస్టింగ్‌తో ఎఫ్‌బి పేజీ
డిసెంబర్‌ ఒకటో తేదీ పోస్టింగ్‌తో ఎఫ్‌బి పేజీ

డిసెంబర్‌ ఒకటో తేదీ పోస్టింగ్‌తో ఎఫ్‌బి పేజీ

TS CMO FB Page: తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక ఫేస్‌బుక్‌ పేజీ మూగబోయింది. డిసెంబర్ 1 తర్వాత సిఎంఓ అధికారిక పేజీలో పోస్టులు కరువయ్యాయి. నవంబర్ 30వ తేదీన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా వెలువడినా బిఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Hyderabadi In UK Polls: యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో సిద్ధిపేట ఐటీ ఇంజనీర్‌, లేబర్ పార్టీ తరపున పోటీ

Graduate Mlc Election: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై బీజేపీ గురి, కీలక నేతలకు ఇన్‌ఛార్జి బాధ్యతలు

Warangal Rains: వరంగల్‌లో ఈదురు గాలులతో భారీ వర్షం, రైతులకు తీవ్ర నష్టం.. గ్రేటర్ లో ఆఫీసర్లు అలర్ట్

CM Revanth Reddy : తెలంగాణలో భూముల మార్కెట్ విలువ సవరణ…! కీలక ఆదేశాలు జారీ

డిసెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు సిఎంఓ అధికారిక పేజీలో చివరి పోస్టింగ్ ఉంది. డిసెంబర్ 4వ తేదీ మధ్యాహత్నం 2గంటలకు బిఆర్ అంబేడ్కర్ తెలంగాణ సెక్రటేరియట్‌లో సిఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగుతుందని పోస్టింగ్ పెట్టారు.

డిసెంబర్3వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో తామే అధికారంలోకి వస్తామని భావించిన బిఆర్‌ఎస్‌ 4వతేదీన క్యాబినెట్‌ సమావేశాన్ని నిర్వహించాలని ఉద్దేశంతో ఆ పోస్టింగ్ పెట్టింది. ఆ తర్వాత ఎలాంటి పోస్టింగ్‌లు లేవు.

డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించినట్టు వెల్లడైంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా గురువారం రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సాయంత్రం క్యాబినెట్ భేటీ కూడా నిర్వహించారు. పలు కీలక దస్త్రాలపై సిఎం హోదాలో సంతకాలు కూడా చేశారు.

అయితే తెలంగాణ సిఎంఓ అధికారిక ఖాాతాలో మాత్రం ఎలాంటి స్పందన వెలువడలేదు. ఈ ఖాతాలను ఎవరు నిర్వహిస్తున్నారనే దానిపై స్పష్టత లేదు. సాధారణంగా సోషల్ మీడియా అధికారిక ఖాతాలను ముఖ్యమంత్రి అత్యంత నమ్మకస్తులైన వారు, పొలిటికల్ కన్సల్టెంట్లు నిర్వహిస్తుంటారు. తెలంగాణలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కూడా సిఎంఓ ఖాతాలో చలనం లేకపోవడం సోసల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యమంత్రి మార్పును కూడా సిఎంఓ గుర్తించని పరిస్థితుల్లో ఉందనే విమర‌్శలు వ్యక్తమవుతున్నాయి. ఫేస్‌బుక్‌ పేజీ నిర్వహణ ఎవరి ఆధీనంలో ఉందనే చర్చ జరుగుతోంది. అధికారిక ఖాతాను స్వాధీనం చేసుకోవడంలో సిఎంఓ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. పేజీని నిర్వహించేది ఎవరనే సందేహం కూడా తలెత్తుతోంది.

తదుపరి వ్యాసం