తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Biometric Skill Scam: స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కామ్.. నకిలీ బయోమెట్రిక్‌‌తో మోసాలు, కేంద్రం నిధులు చోరీ

Biometric Skill Scam: స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కామ్.. నకిలీ బయోమెట్రిక్‌‌తో మోసాలు, కేంద్రం నిధులు చోరీ

HT Telugu Desk HT Telugu

23 April 2024, 10:55 IST

    • Biometric Skill Scam: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ బయోమెట్రిక్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి నకిలీ ఫింగర్ ప్రింట్ మిషిన్, లిక్విడ్, నకిలీ వేలి ముద్రలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు.
స్కిల్ శిక్షణలో బయోమెట్రిక్ మోసాలతో కేంద్రానికి టోకరా
స్కిల్ శిక్షణలో బయోమెట్రిక్ మోసాలతో కేంద్రానికి టోకరా

స్కిల్ శిక్షణలో బయోమెట్రిక్ మోసాలతో కేంద్రానికి టోకరా

Biometric Skill Scam: నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని కొట్టేసేందుకు నకిలీ బయోమెట్రిక్‌లు తయారు చేశారు. శిక్షణా కార్యక్రమాలకు హాజరైనట్టు వేలి ముద్రలు వేసి నిధులు కొట్టేశారు.

ట్రెండింగ్ వార్తలు

Karimnagar Rains : అకాల వర్షాలు, తడిసిపోయిన ధాన్యం..! అన్నదాత ఆగమాగం

TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ హాల్ టికెట్లు విడుద‌ల‌ - డౌన్లోడ్ లింక్ ఇదే

Hyderabad Crime : బీమా డబ్బుల కోసం కోడలి దాష్టీకం..! అత్తమామల హత్యకు కుట్ర, కత్తులతో దాడి చేసిన సుఫారీ గ్యాంగ్

BRS Mlc Election Burden: బీఆర్​ఎస్ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ భారమంతా ‘పల్లా’పైనే! సహకరించని గులాబీ​ నేతలు

రామగుండం సీపీ శ్రీనివాస్ సమక్షంలో నిందితుల్ని పోలీసులు ప్రకటించారు. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం గజ్జెర గ్రామానికి చెందిన పిఎంకెకె భార్మణి మల్లిఖార్జున్, వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేటకు చెందిన షేక్ సలీమ్ జాఫర్, అదే గ్రామానికి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ పాటిబండల వెంకటేశ్వర్లు, మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన కొత్తపల్లి దేవేందర్‌లు ఈ మోసానికి పాల్పడ్డారు.

నకిలీ వేలిముద్రలతో పిఎంకెకె నిధులను కొట్టేశారు..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కౌశల్య కేంద్రం (PMKK) పథకం ద్వారా దేశంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి కోసం వివిధ కోర్సులను ఉచితంగా అందిస్తున్నారు.

దేశంలోని నిరుద్యోగ యువతలో నైపుణ్యాలను Skill Development పెంపొందించేందుకు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం భోపాల్‌కు చెందిన అల్టిమేట్ ఎనర్జీ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు Ultimate Energy Reource Pvt Limited అప్పగించింది. ఈ సంస్థకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో కార్యాలయం ఏర్పాటు చేశారు.

సాహిల్ వలి భోపాల్లోని ప్రధాన కార్యాలయ నిర్వాహకుడిగా, ఆవునూరి శ్రీనివాస్ హైదరాబాద్ లోని మధురానగర్ నగర్ లో కార్యాలయ ఇంఛార్జీగా ఉన్నారు. హైదరాబాద్ కార్యాలయం పరిధిలో మంచిర్యాలతోపాటు హుజూర్ నగర్, జనగామలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి.

నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఏ1 మల్లికార్జున్ మంచిర్యాల సెంటర్ ఆర్గనైజర్ గా పనిచేస్తున్నాడు. 2020 నుండి, ప్రతి సెంటర్లో సంవత్సరానికి 320 మంది చొప్పున నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఇస్తున్నారు. ఈ కోర్సుల్లో యువతకు శిక్షణ ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక్కో యువతకు రూ.13వేల చొప్పున నిధులు మంజూరు చేసేది.

ఈ ఏడాది నుంచి విద్యార్ధుల సంఖ్యను 720కి పెంచి ఒక్కో యువతకు రూ.13వేలు కేటాయించారు. ఈ కోర్సులకు హాజరయ్యే అభ్యర్థుల హాజరు ఆధారంగా మాత్రమే నిధులు కేటాయిస్తారు. మంచిర్యాల కేంద్రంలో ఈ ఏడాది 300 మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

ప్రస్తుతం ప్రతిరోజు సగటున 50 మంది హాజరవుతుండడంతో సంస్థ నిర్వాహకుడు అవునూరి శ్రీనివాస్ ఆదేశాల మేరకు మంచిర్యాల సెంటర్ ఇన్చార్జి మల్లికార్జున్, సలీం జాఫర్ లసహాయంతో 250 మంది అభ్యర్థుల నకిలీ వేలిముద్రలు సృష్టించారు.

వెంకటేశ్వర్లు, హాజరుకాని అభ్యర్థులను బయోమెట్రిక్ మిషన్ ద్వారా నకిలీ వేలిముద్రలతో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించి లక్షలాది రూపాయల నిధులు కొల్లగొట్టారు.

ఇద్దరు పరార్.. నలుగురు అరెస్టు…

మంచిర్యాల పీఎంకేకే PMKK సెంటర్లో బయోమెట్రిక్ హాజరు Attendance Fraud కోసం నకిలీ వేలిముద్రలు వినియోగిస్తున్నారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ తో పాటు మంచిర్యాల mancerial Police పోలీసులు దాడి చేసి ఆఫీస్ ఇన్చార్జ్ గా ఉన్న కొత్తపల్లి దేవేందర్ ను పట్టుకున్నామని రామగుండం సీపీ తెలిపారు.

దేవేందర్ ఇచ్చిన సమాచారం మేరకు విద్యార్థుల నకిలీ వేలి ముద్రలను, హాజరు రిజిస్టర్లు మొదలైనవి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. Cr.No.268/2024, U/sec.420, 465, 468 r/w 34 IPC నమోదు చేశామని సిపి చెప్పారు. దేవేందర్ వాంగ్మూలం ఆధారంగా మంచిర్యాల పోలీసులు పీఎంకేకే సెంటర్ మేనేజర్గా ఉన్న ఏ1) బర్మానీ మల్లికార్జున్ హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని విచారించామన్నారు.

బర్మానీ మల్లికార్జున్ అల్టిమేట్ ఎనర్జీ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క మేనేజర్ ‌గా పనిచేస్తున్నాడు. వారి ప్రధాన కార్యాలయం భోపాల్‌లో ఉంది.తెలంగాణా ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. దాని ఇన్ఛార్జ్ అవనూరి శ్రీనివాస్, వారి పథకం ప్రకారం, అతను వరంగల్ జిల్లా నర్సంపేటలోని పీఎంకేకే కేంద్రానికి ఇన్చార్జిగా ఉన్న విజయ్ ను సంప్రదించి నకిలీ వేలిముద్రల గురించి సమాచారం ఇచ్చాడు.

దీంతో మల్లికార్జున్ నర్సంపేటలో టెక్నీషియన్, కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న వెంకటేశ్వర్లు వద్దకు వెళ్లి విద్యార్థుల వేలిముద్రలు వేయించాలని కోరాడు. ఆపై వెంకటేశ్వర్లు హార్డ్‌ వేర్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న సలీమ్ జాఫర్ సహాయంతో 250 నకిలీ వేలిముద్రల ముద్రలు సేకరించారు.

బయోమెట్రిక్ పరికరంలో వాటిని నిత్యం వినియోగించి, హాజరుకాని విద్యార్థుల కోసం వేలిముద్రల్ని రూపొందించాడు. ఏజెన్సీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి శిక్షణ ఇచ్చినట్టు నివేదికలు ఇచ్చి నిధులు డ్రా చేస్తున్నారు. నిందితుల వాంగ్మూలం మేరకు మంచిర్యాల పోలీసులు నర్సంపేటలో వెంకటేశ్వర్లు, సలీమ్ జాఫర్లను పట్టుకుని నిందితులను అరెస్టు చేశామన్నారు. ఈ మోసానికి ప్రధాన సూత్రధారులైన భూపాల్ కు చెందిన సాహిల్, హైదరాబాద్ కు చెందిన అవునూరి శ్రీనివాస్‌లను అరెస్టు చేయాల్సి ఉంది.

(రిపోర్టింగ్ కేవీ.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)

తదుపరి వ్యాసం