తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mmts Trains : అలర్ట్... వారం పాటు ఈ 22 ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు - రూట్లు, తేదీలివే

MMTS Trains : అలర్ట్... వారం పాటు ఈ 22 ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు - రూట్లు, తేదీలివే

02 July 2023, 11:47 IST

    •  Hyderabad MMTS Trains Cancellation : భాగ్యనగరంలోని నగరంలోని పలు​ రూట్లలో నడిచే ఎంఎంటీఎస్​ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు ఆయా రూట్ల వివరాలతో పాటు తేదీలను వెల్లడించింది.
ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

Cancellation MMTS Train Services: ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. పలు రూట్లలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జులై 3 నుంచి 9వ తేదీ వరకు వారం పాటు 22 ఎంఎంటీఎస్‌ రైళ్ల సర్వీస్‌లను రద్దు చేసినట్లు పేర్కొంది. నిర్వహణ పనుల కోసం రద్దు చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

TS Govt Jobs 2024 : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు... రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినెట్ ఖాళీలు, ముఖ్య తేదీలివే

రద్దు చేసిన రైళ్లు వివరాలు

రూట్ల వివరాలు:

లింగంపల్లి - హైదరాబాద్(47129)

లింగంపల్లి - హైదరాబాద్ (47132)

లింగంపల్లి - హైదరాబాద్ (47133)

లింగంపల్లి - హైదరాబాద్ (47135)

హైదరాబాద్ - లింగంపల్లి(47136)

హైదరాబాద్ - లింగంపల్లి(47105)

హైదరాబాద్ - లింగంపల్లి(47108)

హైదరాబాద్ - లింగంపల్లి(47109)

ఉమద్ నగర్ - లింగంపల్లి(47110)

లింగంపల్లి - ఫలక్ నుమా(47112)

లింగంపల్లి- ఉమద్ నగర్(47165)

లింగంపల్లి - ఫలక్ నుమా(47189)

ఫలక్ నుమా- లింగంపల్లి(47178)

ఉమద్ నగర్ - లింగంపల్లి(47179)

లింగంపల్లి - ఉమద్ నగర్ (47158)

ఉమద్ నగర్ - లింగంపల్లి(47211)

రామచంద్రాపురం - ఫలక్ నుమా(47212)

ఫలక్ నుమా - లింగంపల్లి(47214)

ఉమద్ నగర్ - లింగంపల్లి(47177)

లింగంపల్లి- ఉమద్ నగర్(47181)

ప్రత్యేక రైళ్లు పొడిగింపు…

Special Trains:ప్రయాణికుల రద్దీ కొనసాగుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు ప్రత్యేక రైళ్లను మరో రెండు నెలల పాటు పొడిగించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు నడిచే రైళ్ళను జులై 6 ఆగష్టు 31 మధ్య కాలంలో నడుపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు వీక్లీ స్పెషల్‌గా నడుపుతున్నారు.

ట్రైన్ నంబర్ 04121/04122 సుబేదార్‌గంజ్‌-సికింద్రాబాద్‌ - సుబేదార్‌గంజ్‌ రైలును ప్రతి గురువారం, శుక్రవారాల్లో నడుపుతారు.

ట్రైన్‌ నంబర్ 07445/07446 కాకినాడ టౌన్‌ -లింగంపల్లి-కాకినాడ టౌన్‌ రైలును ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్‌ నుంచి మంగళ, గురు, శనివారాల్లో లింగపల్లి నుంచి నడుపుతారు.

ట్రైన్ నంబర్ 07191/07192 కాచిగూడ -మధురై- కాచిగూడ రైలును కాచిగూడ నుంచి ప్రతి సోమవారం, మధురై నుంచి ప్రతి బుధవారం నడుపుతారు.

ట్రైన్ నంబర్ 07695/07696 సికింద్రాబాద్- రామనాథపురం- సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు సికింద్రబాద్ నుంచి ప్రతి బుధవారం, రామనాథ పురం నుంచి శుక్రవారం బయలుదేరుతాయి.

ట్రైన్ నంబర్ 07189/07190 నాందేడ్- ఈరోడ్ - నాందేడ్ రైలు నాందేడ్‌లో శుక్రవారం, ఈరోడ్‌లో ప్రతి శుక్రవారం బయల్దేరుతుంది.

ట్రైన్ నంబర్ 07435/07436 కాచిగూడ-నాగర్‌కోయిల్‌ - కాచిగూడ ప్రత్యేక రైలు కాచిగూడలో ప్రతి శుక్రవారం, తిరుగు ప్రయాణంలో ఆదివారం బయలుదేరుతుంది.

ట్రైన్ నంబర్ 03253 పాట్నా- సికింద్రాబాద్ రైలు ప్రతి సోమ, బుధవారాల్లో బయలు దేరుతుంది. ట్రైన్ నంబర్ 07255/07256 హైదరాబాద్- పాట్నా - హైదరాబాద్‌ రైలు హైదరాబాద్‌లో బుధవారం, పాట్నాలో శుక్రవారం బయల్దేరుతుంది.

ట్రైన్ నంబర్ 03225 దానాపూర్‌ - సికింద్రాబాద్‌ రైలు గురువారం, 03226 సికింద్రాబాద్‌ - దానాపూర్‌ రైలు ఆదివారం బయల్దేరుతుంది.

ట్రైన్ నంబర్ 03357/03358 బరౌనీ- కోయంబత్తూర్ - బరౌనీ రైలు బరౌనీలో శనివారం, కోయంబత్తూరులో బుధవారం బయల్దేరుతుంది.

ట్రైన్ నంబర్ 05271 ముజఫర్‌పూర్‌-యశ్వంత్‌ పూర్‌ రైలు ప్రతి శుక్రవారం, ట్రైన్ నంబర్ 05272 యశ్వంత్ పూర్‌- ముజఫర్‌ పూర్‌ రైలు సోమవారం నడుస్తాయి.

ట్రైన్ నంబర్ 05215/05216 బరౌనీ-యశ్వంతపూర్‌- బరౌనీ రైలు బరౌనీలో శనివారం, యశ్వంతపూర్‌లో మంగళవారం బయల్దేరుతుంది.

తదుపరి వ్యాసం