TS Intermediate : అలర్ట్... ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గడువు పెంపు, ఎప్పటివరకంటే?-ts intermediate first year admissions date extended to 25 july check imp details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Intermediate : అలర్ట్... ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గడువు పెంపు, ఎప్పటివరకంటే?

TS Intermediate : అలర్ట్... ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గడువు పెంపు, ఎప్పటివరకంటే?

TS Inter First year Admissions 2023: విద్యార్థులకు అలర్ట్ ఇచ్చింది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు. ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాల గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కొత్త తేదీలను తెలిపింది.

తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రవేశాలు

Telangana State Board of Intermediate Education: పదో తరగతి పాసై ఇంటర్ లోకి ప్రవేశించే వారికి తెలంగాణ ఇంటర్ బోర్డు అలర్ట్ ఇచ్చింది. ఫస్టియర్‌ ప్రవేశాల గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. మొదటి సంవత్సరంలో ప్రవేశాల గడువు జూన్‌ 30తో ముగిసినప్పటికీ... జులై 25 వరకు గడువును పొడిగించినట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు ప్రవేశాలు తీసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇంటర్ ప్రవేశాల విషయంలో ఇప్పటికే ఇంటర్ బోర్డు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే విద్యార్థులు చేరాలని ప్రకటనలో స్పష్టం చేసింది. గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను కూడా బోర్డు అధికారిక వెబ్ సైట్ టీఎస్‌బీఐఈ లో అందుబాటులో ఉంచింది. అడ్మిషన్ల ప్రక్రియకు ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించవద్దని.. పదో తరగతి గ్రేడింగ్‌ ఆధారంగానే ప్రవేశాలు జరపాలని ఆదేశించింది. ఇక కాలేజీ సీట్లలో ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసీలకు 29, వికలాంగులకు 3, ఎన్‌సీ సీ, స్పోర్ట్స్‌, ఇతర అర్హతలున్న వారికి 5, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3, ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించింది. ప్రతీ కాలేజీలో బాలికలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

తరగతుల నిర్వహణకు సంబందించి పలు మార్గదర్శకాలను కూడా ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఇందులో చూస్తే....ప్రతీ సెక్షన్‌లోనూ 88 మంది విద్యార్థులనే చేర్చుకోవాలని స్పష్టం చేసింది. అదనపు సెక్షన్లకు బోర్డు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. విద్యార్థుల ఆధార్‌ నెంబర్‌ తప్పకుండా నమోదు చేయటంతో పాటు... అడ్మిషన్ల వివరాలను ప్రతీ రోజూ కాలేజీ బోర్డుపై ఉంచాల్సి ఉంటుంది. జోగిని, తండ్రి లేని పిల్లల విషయంలో పేరెంట్స్‌ కాలమ్‌లో తల్లి పేరు నమోదు చేయాలని సూచించింది.

ఇక ఇటీవల విడుదలైన తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సవరంలో 63.85% మంది పాస్ కాగా, సెకండియర్‌లో 67.26 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ద్వితీయ సంవత్సరం 63.49 శాతం మంది పాస్ అయ్యారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో మేడ్చల్, సెకండియర్ ఫలితాల్లో ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచాయి. సెకండియర్ ఫలితాల్లో 1,73,61 మందికి గ్రేడ్‌-ఎ రాగా, 54,776 మంది విద్యార్థులకు గ్రేడ్‌-బి సాధించిన సంగతి తెలిసిందే.