తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scr Special Trains : తెలుగు ప్రయాణికులకు అలర్ట్... పూరి రథయాత్రకు ప్రత్యేక రైళ్లు

SCR Special Trains : తెలుగు ప్రయాణికులకు అలర్ట్... పూరి రథయాత్రకు ప్రత్యేక రైళ్లు

18 June 2023, 5:46 IST

    • South Central Railway Special Trains: పూరి రథయాత్రకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్ రైల్వే. ఈ మేరకు వివరాలను పేర్కొంది. 
పూరి రథయాత్రకు ప్రత్యేక రైళ్లు
పూరి రథయాత్రకు ప్రత్యేక రైళ్లు

పూరి రథయాత్రకు ప్రత్యేక రైళ్లు

South Central Railway Special Trains Latest: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా పూరీ రథ యాత్రకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో కొన్ని హైదరాబాద్ నుంచి వెళ్తుండగా…మరికొన్ని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అందుబాటులో ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

TS Universities VCs : తెలంగాణలో 10 వర్సిటీలకు ఇన్ ఛార్జ్ వీసీల నియామకం, కేయూలో ఫైళ్ల మాయం కలకలం!

NGT On Manair Sand Mining : మానేరు ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ సంచలన తీర్పు, తెలంగాణ ప్రభుత్వానికి భారీగా జరిమానా!

Deepthi Jeevanji : వరంగల్ బిడ్డ ప్రపంచ రికార్డు, పారా అథ్లెటిక్స్ లో దీప్తి జివాంజీకి గోల్డ్

TS Paddy Bonus : రూ.500 బోనస్ సన్న ధాన్యం నుంచి మొదలుపెట్టాం- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పూరిలో ఈ నెల 20 నుంచి రథ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ రథయాత్రకు 6 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 18, 19, 20, 21, 22 తేదీలలో సేవలు అందించనున్నాయి. సికింద్రాబాద్‌-మలాటిపట్పూర్‌, నాందేడ్‌- కుర్దారోడ్‌, కాచిగూడ - మలాటిపట్పూర్‌ స్టేషన్ల మధ్యలో స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి.

ప్రత్యక రైళ్ల వివరాలు

జూన్ 18వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నుంచి మలాటిపట్పూర్, 19వ తేదీన మలాటిపట్పూర్ నుంచి సికింద్రాబాద్ కు, 19న నాందేడ్ నుంచి ఖుర్దా రోడ్, 20న ఖుర్దా రోడ్ నుంచి నాందేడ్ కు రైలు నడుస్తాయి. ఇక జూన్ 21న కాచిగూడ నుంచి మలాటిపట్పూర్, 21న మలాటిపట్పూర్ నుంచి కాచిగూడకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు ప్రకటించారు.

సికింద్రాబాద్‌-మలాటిపట్పూర్‌ మధ్య వెళ్లే ప్రత్యేక రైళ్లు.. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామల్ కోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బీరంపూర్, కుర్దారోడ్ స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు.

కాచిగూడ - మలాటిపట్పూర్‌ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు…. మల్కాజ్ గిరి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామల్ కోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బీరంపూర్, కుర్దా రోడ్ స్టేషన్లలో ఆగుతాయని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైళ్లల్లో ఏసీ 2 కమ్ ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయి,

తదుపరి వ్యాసం