తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ponguleti Comments: వెనక్కి తగ్గకండి.. నేను కూడా రోడ్లపైకి వస్తాను - పొంగులేటి కీలక వ్యాఖ్యలు

Ponguleti Comments: వెనక్కి తగ్గకండి.. నేను కూడా రోడ్లపైకి వస్తాను - పొంగులేటి కీలక వ్యాఖ్యలు

02 July 2023, 13:01 IST

    • ponguleti srinivas reddy: బీఆర్ఎస్ పతనం ఖమ్మం నుంచే మొదలుకాబోతుందన్నారు మాజీ ఎంపీ పొంగులేటి. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన… కాంగ్రెస్‌ సభను అడ్డుకునేందుకు కేసీఆర్‌ సర్కార్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti srinivas Reddy On BRS Govt: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన ఖమ్మం సభకు ప్రజలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయవద్దని… మీకు అండగా తాను ఉంటానని చెప్పారు. మీ కోసం నేను కూడా రోడ్లపైకి వస్తానని స్పష్టం చేశారు. ఆనాడు తెలంగాణ కోసం ఖమ్మంలోని పాల్వంచ నుంచే తొలి అడుగు పడిందని… ఇవాళ కేసీఆర్ సర్కార్ పతనానికి కూడా ఖమ్మం నుంచే అడుగు పడబోతుందని వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

బీఆర్ఎస్ ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి సభను ఫెయిల్‌ చేయాలని చూస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ రుణం తీర్చుకోవాటనికి… లక్షలాది మంది ఈ సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సభ కోసం ఆర్టీసీ బస్సులు కోరితే ఇవ్వలేదని… ప్రైవేటు వాహనాలు కూడా రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 1700 వాహనాలు సీజ్‌ చేశారని… జిల్లాలో అనేక ప్రాంతాల్లో చెక్‌ పోస్టులు పెట్టి వాహనాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే కూడా స్వీకరించే పరిస్థితిలో లేరని దుయ్యబట్టారు.

"సభను ఫెయిల్ చేయాలని తాపత్రాయపడుతున్నారు. ఆర్టీసీ బస్సులు అడిగితే పర్మిషన్ ఇవ్వలేదు. బస్సులు ఇవ్వకున్నా ఖమ్మం జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. లక్షలాది మంది ప్రజలు సభకు రానున్నారు. ప్రైవేటు వాహనాలను కూడా రాకుండా సీజ్ చేసే పనిలో ఉన్నారు అధికారులు. 15 వేల వాహనాల్లో జనం రాబోతున్నారు. శనివారం అర్ధరాత్రి నుంచి అన్ని ప్రాంతాల్లో రోడ్లను బ్లాక్ చేశారు. పరిసర ప్రాంతాల్లో జిల్లాల్లో కూడా మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్లను పెట్టారు. వాహనాలను సీజ్ చేస్తూ... వాహనదారులను భయభ్రాంతులను చేసే పనిలో పడ్డారు. 1800 వాహనాలను సీజ్ చేశారని సమాచారం ఉంది" అని పొంగులేటి అన్నారు.

పద్ధతి మార్చుకోండి - రేవంత్ రెడ్డి

“నేడు ఖమ్మంలో కాంగ్రెస్ తలపెట్టిన ‘తెలంగాణ జన గర్జన’ బీఆర్ఎస్ వెన్నులో వణుకుపుట్టిస్తోంది. సభకు వచ్చే అశేష జనవాహినికి ట్రాన్స్ పోర్టు అడ్డంకులు సృష్టించి, సంక్షేమం కట్ చేస్తామని బెదిరించి ప్రభంజనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.అర చెయ్యిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపలేరన్న సత్యాన్ని ప్రభుత్వం గ్రహిస్తే మంచిది. అధికారులు పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి” అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

3.8 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. “తెలంగాణ జనగర్జన మహా సభలో ప్రజల ఆకాంక్షల కోసం రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. ఈరోజు ఖమ్మంలో మా 1360 కి.మీ సుదీర్ఘ పాదయాత్రను పూర్తి చేసుకున్నందుకు CLP నాయకుడు భట్టి గారికి అభినందనలు తెలియజేస్తున్నాము. పలువురు సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరి ప్రజాకూటమిని బలోపేతం చేయనున్నారు. తెలంగాణలో కొత్త ఆవిర్భావానికి మా బ్లూప్రింట్ సిద్ధమైంది” అని ఖర్గే ట్వీట్ చేశారు.

తదుపరి వ్యాసం