తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  రూబిక్స్ క్యూబ్స్‌తో కళాఖండాలు.. గిన్నీస్ రికార్డు సాధిస్తానంటున్న యువకుడు

రూబిక్స్ క్యూబ్స్‌తో కళాఖండాలు.. గిన్నీస్ రికార్డు సాధిస్తానంటున్న యువకుడు

HT Telugu Desk HT Telugu

23 January 2024, 13:01 IST

    • వృత్తి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. కానీ ప్రవృతి మాత్రం రూబిక్స్ క్యూబ్స్‌తో కళాఖండాలు సృష్టించడం. ఇప్పుడు గిన్నీస్ రికార్డు బద్దలు కొట్టడమే తన ముందున్న లక్ష్యం అని అంటున్నాడు మంచిర్యాల యువకుడు.
క్యూబ్స్‌తో రాముడి చిత్రం రూపొందించిన సాయిని ఆనంద్
క్యూబ్స్‌తో రాముడి చిత్రం రూపొందించిన సాయిని ఆనంద్

క్యూబ్స్‌తో రాముడి చిత్రం రూపొందించిన సాయిని ఆనంద్

కృషితోనాస్తి దుర్భిక్షం అంటారు, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, అసాధ్యమయ్యే పనులను సైతం ఇష్టంతో చేసి సాధ్యం చేస్తారు. ఈ కోవలో పట్టుదలతో ముందుకు సాగుతూ, అనుకున్న రికార్డులు బ్రేక్ చేయడానికి ముందుకు సాగుతున్నారు సాయిని ఆనంద్.

ట్రెండింగ్ వార్తలు

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

Wardhannapet Govt Hospital : వర్ధన్నపేటలో దారుణం-ఫోన్లో డాక్టర్ డైరెక్షన్ గర్భిణీకి నర్సులు డెలివరీ, శిశువు మృతి

TS Universities VCs : తెలంగాణలో వీసీల నియామకంపై కసరత్తు, 10 యూనివర్సిటీలకు 1382 అప్లికేషన్లు

WhatsApp Triple Talaq : వాట్సాప్ లో భార్యకు ట్రిపుల్ తలాక్, ఆదిలాబాద్ లో వ్యక్తి అరెస్టు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల చెందిన సాయిని ఆనంద్ తన సతీమణి నిహారికతో కలిసి వినూత్న ప్రయోగాలు చేసి సఫలీకృతులు అవుతున్నారు. ఎంసీఏ చదివి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ, ఖాళీ సమయాల్లో రికార్డుల కోసం పరిగెత్తుతున్నారు.

రూబిక్స్ క్యూబ్ ద్వారా అనేక చిత్రాలు వేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటివరకు అనేక చిత్రాలు వేసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొని యువతకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. రూబిక్స్ ద్వారా రాముడి చిత్రం, సీఎం రేవంత్ రెడ్డి చిత్రం, పలు ఇతర చిత్రాలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రాముడు విగ్రహాన్ని రూబిక్స్ క్యూబ్ ద్వారా నిర్మించి అందరి మన్ననలు పొందుతున్నారు.

చైనా రికార్డు బ్రేక్ చేయాలని ఉంది: ఆనంద్

రూబిక్స్ క్యూబ్ ద్వారా వివిధ చిత్రాలు వేస్తున్న ఆనంద్‌ను హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ప్రతినిధి పలకరించగా చైనా దేశంలో 85,794 రూబిక్స్ క్యూబ్‌లతో చిత్రాలు వేసి రికార్డు సాధించారని, తాను ఇండియాలో అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని రూబిక్స్ క్యూబ్ ద్వారా నిర్మించి చైనా రికార్డును బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

రామ మందిర నిర్మాణానికి సుమారు ఒక లక్ష రూబిక్స్ క్యూబ్స్ అవసరం అవుతున్నాయని అన్నారు. ఒక్కొక్క క్యూబ్ సుమారు వంద రూపాయలు ఉంటుందని, ఖర్చుతో కూడుకున్న పని అవడం వల్ల దాతల సహాయం కోరుతున్నట్లు తెలిపారు. దాతలు ఒక్కొక్క రూబిక్స్ క్యూబ్‌ను ఒక రామ మందిరం ఇటుకలా భావించి తనకు ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు. ఈ అపురూపమైన కార్యక్రమం ద్వారా గిన్నీస్ రికార్డు బ్రేక్ చేస్తానని చెబుతున్నారు. తనకు ఆర్థిక సాయం చేయదలిచిన వారు 8341106332 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

-రిపోర్టింగ్ వేణుగోపాల్ కామోజీ, ఆదిలాబాద్

టాపిక్

తదుపరి వ్యాసం