తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nmops : పాత పెన్షన్ విధానం సాధనకై ఎన్ఎంఓపీఎస్ ఉద్యమ కార్యాచరణ..

NMOPS : పాత పెన్షన్ విధానం సాధనకై ఎన్ఎంఓపీఎస్ ఉద్యమ కార్యాచరణ..

HT Telugu Desk HT Telugu

05 March 2023, 18:27 IST

    • NMOPS : పాత పెన్షన్ విధానాన్ని తిరిగి సాధించుకునేందుకు నేషనల్ మూవ్ మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సంఘం ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. ఏప్రిల్ 23 నుంచి అక్టోబర్ 1 వరకు పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. 
ఢిల్లీలో ఎన్ఎంఓపీఎస్ సమావేశం
ఢిల్లీలో ఎన్ఎంఓపీఎస్ సమావేశం

ఢిల్లీలో ఎన్ఎంఓపీఎస్ సమావేశం

NMOPS : ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని... నేషనల్ మూవ్ మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (national movement for old pension scheme) సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ పిలుపునిచ్చారు. 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని...... పాత పెన్షన్ విధానం కోసం గట్టిగా నినదించాలని అన్నారు. నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (NMOPS) జాతీయ కార్యవర్గ సమావేశం ఆదివారం (మార్చి 5న) ఉదయం ఢిల్లీలోని ఎన్‌డి తివారీ భవన్‌ యూత్ సెంటర్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఎన్ఎంఓపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది. ఏప్రిల్ 23న దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో పెన్షన్ రాజ్యాంగ మార్చ్ నిర్వహించాలని... ఆగస్టు 1 నుంచి 9 వరకు ఘంటి బజావో - పెన్షన్ దిలావో కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించారు. ప్రతి ఎంపీ, ఎమ్మెల్యేలను కలిసి సమస్యలు విన్నవించాలని నిర్ణయించారు. అక్టోబర్ 1న ఢిల్లీ రాం లీలా మైదానంలో పెన్షన్ శంఖ్ నాథ్ భారీ బహరింగ సభ జరపాలని జాతీయ కార్యకవర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పి. ఎఫ్. ఆర్. డి .ఏ చట్టాన్ని నేడు బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉద్యోగుల సొమ్మును కార్పొరేట్ల పాలు చేస్తుందని వాపోయారు. ఉద్యోగుల డిమాండ్ మేరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించిందని చెప్పారు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఓపీఎస్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఇటీవల హర్యానాలో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపిన ఉద్యోగ, ఉపాధ్యాయులపై పోలీసులు లాఠీ చార్జ్ జరపడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. డిమాండ్లు నెరవేర్చాలని కోరితే.. ఇలాంటి చర్యలకు పాల్పడం సబబు కాదని చెప్పారు.

ఎన్ఎంఓపీఎస్ జాతీయ కార్యవర్గ సమావేశానికి దేశంలోని 22 రాష్ట్రాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రైల్వే ఆర్డినెన్స్, పోస్టల్, సీపీడబ్ల్యూడీ తదితర శాఖల కేంద్ర ఉద్యోగ ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీపీఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్ రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్ లు హాజరయ్యారు. ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్న హర్యానా, మధ్యప్రదేశ్ ,కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల లో సిపిఎస్ ఉద్యమ కార్యచరణ బలోపేతం చేయాలని, ఓట్ ఫర్ ఓ. పి .ఎస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పిలుపుని స్థిత ప్రజ్ఞ పిలుపునిచ్చారు.

తదుపరి వ్యాసం