తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar-mumbai Train: కరీంనగర్ లో ముంబై రైలు కూత, వలస కార్మికులకు ప్రయోజనం.. ఫలించిన నిరీక్షణ

Karimnagar-Mumbai Train: కరీంనగర్ లో ముంబై రైలు కూత, వలస కార్మికులకు ప్రయోజనం.. ఫలించిన నిరీక్షణ

HT Telugu Desk HT Telugu

11 April 2024, 7:31 IST

    • Karimnagar-Mumbai Train: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల కల నెరవేరింది. ముంబైకి నేరుగా ట్రైన్ లో ప్రయాణించే సౌకర్యం లభించింది. 
కరీంనగర్‌ నుంచి ముంబైకు ప్రత్యేక రైలు
కరీంనగర్‌ నుంచి ముంబైకు ప్రత్యేక రైలు

కరీంనగర్‌ నుంచి ముంబైకు ప్రత్యేక రైలు

Karimnagar-Mumbai Train: దక్షిణ మధ్య రైల్వే Karimnagar కరీంనగర్ - Mumbai ముంబై మధ్య నూతనంగా ప్రత్యేక రైలును Special Train ప్రారంభించింది. దశాబ్దాలుగా కరీంనగర్‌ ప్రజలు ఎదురుచూస్తున్న ముంబై రైలు ఉగాది ugadi నుంచి అందుబాటులోకి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Sircilla News : రూ. 7 వేలు లంచం డిమాండ్, ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ సీనియర్ అసిస్టెంట్

ACB Raids On MRO : భూమి రిజిస్ట్రేషన్ కు లంచం డిమాండ్- ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో, ధరణి ఆపరేటర్

Hyderabad Finance Fraud : హైదరాబాద్ లో బోర్డు తిప్పేసిన మరో ఫైనాన్స్ సంస్థ, రూ.200 కోట్లు స్వాహా!

TS Cabinet Decisions : ధాన్యం కొనుగోళ్ల బాధ్యత కలెక్టర్లకే, సన్న వడ్లకే రూ.500 బోనస్- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే!

ముంబైలో మంగళవారం మధ్యాహ్నం బయలుదేరిన ప్రత్యేక రైలు బుధవారం ఉదయానికి కరీంనగర్ కు చేరింది. ఈ ప్రత్యేక రైలును ఉగాది నుంచి మే 28 వరకు వారానికి ఒకరోజు నడపాలని Weekly train దక్షిణ మద్య రైల్వే అధికారులు నిర్ణయించారు.

8 ట్రిప్పుల వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైల్ ను దక్షిణ మధ్య రైల్వే జోన్, ముంబై డివిజన్ అధికారులు నడుపుతున్నారు. రైలు దిగువ మార్గంలో 8 ట్రిప్పులు ట్రైన్ నంబర్ 01067 ప్రతీ మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబైలో బయలుదేరి మరుసటి రోజు బుధవారం ఉదయం 8.30 గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది.

ఎగువ మార్గంలో ట్రైన్ నంబర్ 01068 కరీంనగర్ నుంచి ముంబైకి 8 ట్రిప్పులు ప్రతీ బుధవారం రాత్రి 7.05 గం టలకు బయలుదేరి మరుసటి రోజు గురువారం మధ్యాహ్నం 1.40 గంటలకు ముంబై రైల్వే స్టేషన్ చేరుకుంటుంది.

లింగంపేట్ స్టేషన్ లో హాల్టింగ్ ఇవ్వాలి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్ల, కొండగట్టు, జగిత్యాల, మెట్ పల్లి, కోరుట్ల నుంచి ముంబైకి వలసలు అధికంగా ఉంటాయి. వివిధ రకాల పనులు చేసేందుకు చాలామంది ముంబై పరిసరాలకు వెళ్తుంటారు. ఈ కారణంగానే వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ కరీంనగర్ వరకు నడుపుతున్నారు.

ఈ రైలుకు మెట్ పల్లి, కోరుట్లలో రైల్వే అధికారులు స్టాప్ సదుపాయం కల్పించారు. జగిత్యాల నుంచి ముంబైలో సెటిలైనవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. జగిత్యాల సమీపంలోని లింగంపేట స్టేషన్ లో హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

పెద్దపల్లి వరకు పొడిగించాలి

ముంబై-కరీంనగర్ స్పెషల్ ట్రైన్ ను పెద్దపల్లి జంక్షన్ వరకు పొడిగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. పెద్దపల్లి నుంచి ముంబై వెళ్లాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందంటున్నారు. ఎందుకంటే ఈ రైలు ఉదయం 8.30 గం టలకు కరీంనగర్ చేరుకుంటుంది.

అప్పటినుంచి రాత్రి 7 గంటల వరకు దాదాపు 10 గంటలకు పైగా సమయం ఖాళీగానే ఉంటుంది. ఆ టైంలో రైలును పెద్దపల్లి వరకు పొడిగిస్తే సమయం ఆదాతోపాటు పెద్దపల్లి జిల్లావాసులకు సైతం ఉపయోకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అదే విధంగా గతేడాది నవంబర్ వరకు నడిచిన కాజీపేట- దాదర్ ముంబై-కాజీపేట వీక్లీ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలును పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. 07195/96 నంబర్ రైలు కాజీపేట- దాదర్ ముంబై- కాజీపేట మధ్య సేవలందించేది. ఈ సమ్మర్ లో మళ్ళీ పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

(రిపోర్టింగ్ కేవీ. రెడ్డి,ఉమ్మడి కరీంనగర్ జిల్లా)

తదుపరి వ్యాసం