తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Ap Weather Updates : అల్పపీడనం ఎఫెక్ట్... మరో 3 రోజుల పాటు వర్షాలు!

TS AP Weather Updates : అల్పపీడనం ఎఫెక్ట్... మరో 3 రోజుల పాటు వర్షాలు!

HT Telugu Desk HT Telugu

05 May 2023, 19:40 IST

    • Telugu States Weather Updates: తెలుగు రాష్ట్రాలకు మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. ఎల్లుండి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
అల్పపీడనం ఎఫెక్ట్... వర్ష సూచన
అల్పపీడనం ఎఫెక్ట్... వర్ష సూచన (twitter)

అల్పపీడనం ఎఫెక్ట్... వర్ష సూచన

Telugu States Weather Updates: తెలంగాణతో పాటు ఏపీలో వానలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా... మరోసారి వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఐఎండీ అంచనాల ప్రకారం 6వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడొచ్చని, దీని ప్రభావంతో 7న అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే వీలుందని అంచనా వేసింది. ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో 8న వాయుగుండంగా కేంద్రీకృతమవుతుందని తెలిపింది. ఫలితంగా అది ఉత్తరం దిశగా పయనిస్తూ మధ్య బంగాళాఖాతం వైపునకు కదులుతూ తుపానుగా బలపడే అవకాశముందని తెలిపింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

TS Court Jobs 2024 : తెలంగాణ హైకోర్టు నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ - భారీగా వేతనం, ముఖ్య తేదీలివే

Online Job Fraud: ఆన్​ లైన్​ జాబ్​ పేరుతో మోసం, 12 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు, వరంగల్‌లో పెరుగుతున్న సైబర్ మోసాలు

TS TET 2024 Hall Tickets : కాసేపట్లో తెలంగాణ టెట్‌ హాల్‌ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Hyd Brutal Attack: హైదరాబాద్‌లో ఘోరం.. పెంపుడు కుక్క వివాదంతో భార్యాభర్తలపై యువకుల దాడి

గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. మరో రెండు మూడు రోజుల కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఆ తర్వాత వాతవరణం పొడిగా మారే అవకాశం ఉందని అంచనాలు వేస్తోంది వాతావరణ శాఖ.

ఏపీలోనూ వర్షాలు..

ఐఎండి అంచనా ప్రకారం రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఎల్లుండి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి ముప్పు లేదని అంచనాలు వేసింది. అల్పపీడనం ఏర్పడిన తదుపరి ఐఎండీ సమాచారం మేర ఇతర వివరాలు తెలియజేస్తామని వెల్లడించింది. రేపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, తిరుపతి, కర్నూలు, నంద్యాలతో పాటు పలు జిల్లాల్లో అక్కడకక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. సోమవారం కూడా పలు జిల్లాలకు కూడా వర్ష సూచన ఇచ్చింది.

తదుపరి వ్యాసం