తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Medical Quota: ఆ ఉత్తర్వులు మొదట కోర్టును ఆశ్రయించిన వారికే పరిమితం

TS Medical quota: ఆ ఉత్తర్వులు మొదట కోర్టును ఆశ్రయించిన వారికే పరిమితం

HT Telugu Desk HT Telugu

08 September 2023, 6:37 IST

    • TS Medical quota: స్థానిక కోటా విషయంలో మొదట హైకోర్టును ఆశ్రయించిన వారికి మాత్రమే కోర్టు ఉత్తర్వులు వర్తిస్తాయని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. ఆలస్యంగా స్పందించి, తమను స్థానికులుగా గుర్తించాలనే వారిపై హెల్త్ వర్శిటీయే నిర్ణయం తీసుకుంటుందని తేల్చి చెప్పింది. 
తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు (Twitter )

తెలంగాణ హైకోర్టు

TS Medical quota: తెలంగాణలో మెడికల్ సీట్ల భర్తీ వ్యవహారంపై దాఖలవుతున్న పిటిషన్లపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో శాశ్వత నివాసితుల విషయంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను మొదట కోర్టును ఆశ్రయించిన వారికే వర్తిస్తాయని స్పష్టం చేసింది. స్థానిక కోటాలో వైద్య సీట్లు కేటాయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.

ట్రెండింగ్ వార్తలు

Food Inspection in Hyderabad : పాడైపోయిన ఆహార పదార్థాలు, పాటించని ప్రమాణాలు - తనిఖీల్లో విస్తుపోయే విషయాలు..!

Karimnagar Tourism : చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రసిద్ధి చెందిన ఆలయాలు - కరీంనగర్ జిల్లాలో చూడాల్సిన ప్రాంతాలివే..!

19 May 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

TS ECET 2024 Results : రేపు తెలంగాణ ఈసెట్ 2024 ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి

ఈ తరహా వినతులపై నిర్ణయం తీసుకునే అధికారం కాళోజీ వర్సిటీదేనని హైకోర్టు స్పష్టం చేసింది. స్థానికత విషయంలో తమ హక్కులపై నిష్క్రియాపరంగా, ఉదాసీనంగా ఉండి, చివరి నిమిషంలో వ్యాజ్యాలు దాఖలు చేసిన వారికి కోర్టులు విచక్షణాధికారాన్ని వినియోగించి అండగా నిలబడలేవని హైకోర్టు పేర్కొంది.

ఎంబిబిఎస్‌,బిడిఎస్ ప్రవేశాల్లో స్థానిక కోటాకు సంబంధించి గత నెల 29న కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో శాశ్వత నివాసితులై తల్లిదండ్రులు ఉపాధి కోసం అనివార్యంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని స్థానికులుగా గుర్తించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు, స్థానికత విషయంలో సహజ న్యాయ సూత్రాలపై స్పస్టత ఇస్తూ కీలక ఆదేశాలు జార చేసింది. అదే సమయంలో ఆ ఉత్తర్వులు కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లకు మాత్రమే పరిమితం చేసింది.

ఇతర ప్రాంతాల్లో చదువుకున్నా, తెలంగాణ స్థానికత ఉన్న వారికి అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో అదే తరహాలో మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. గత 4 రోజులుగా దాఖలవుతున్న పలు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేసింది.

ఒకటీరెండేళ్లు ఇతర రాష్ట్రాల్లో చదివిన.. రాష్ట్రానికి చెందిన శాశ్వత నివాసితులకు అధికారులు స్థానికత ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని, దానిని సమర్పించిన ఆయా విద్యార్థులకు స్థానిక రిజర్వేషన్‌ కోటా కింద వైద్య సీట్లు కేటాయించాలని గత నెల 29న హైకోర్టు తీర్పును అమలు చేసే విషయంలో సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుంది. హైకోర్టు తీర్పు మేరకు స్థానిక కోటా కింద ప్రవేశాలు కల్పించాలని కాళోజీ యూనివర్సిటీకి వినతి పత్రాలు సమర్పించి, హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ జరిపిన ధర్మాసనం వాటిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది.

నిర్ణీత గడువులోగా నిబంధనలను సవాలు చేస్తూ కోర్టుకు వచ్చిన వారికి ఉపశమనం కలిగించిన ఉత్తర్వులను, ఆలస్యంగా కోర్టును ఆశ్రయించిన వారికి వర్తింప చేయలేమని స్పష్టంచేసింది.

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం వైద్య ప్రవేశాలను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాల్సి ఉందని ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయిందని ప్రభుత్వం వివరించింది. స్థానిక కోటా కింద సీటును ఆగస్టు 2న యూనివర్సిటీ తిరస్కరించగా ఆగస్టు 31న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసేవరకూ పిటిషనర్లు సీటు కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని కోర్టు పేర్కొంది.

తమకు దక్కాల్సిన హక్కులపై పిటిషనర్లు నిష్క్రియతో వ్యవహరించారని ఇలాంటి సందర్భాల్లో రాజ్యాంగ కోర్టులు ఎలాంటి ఉపశమనాన్ని కలిగించలేవన్నారు. ఇదే విషయాన్ని ఎస్‌.ఎస్‌.బాలు వర్సెస్‌ కేరళ, విజయకుమార్‌ కౌల్‌ వర్సెస్‌ కేంద్రం, యూపీ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వర్సెస్‌ రామ్‌గోపాల్‌ కేసుల్లో సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని గుర్తు చేసింది.

విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని తిరస్కరిస్తే 29 రోజులు కనీసం వివరణ ఇవ్వకుండా జాప్యం చేశారని, అదే పిటిషనర్లకు తీవ్ర నష్టం చేసిందన్నారు. ప్రస్తుతం కోర్టులో దాఖలైన పిటిషన్లను అనుమతిస్తే.. ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల ప్రక్రియ ఎప్పటికీ పూర్తికాదని అభిప్రాయపడింది. పిటిషనర్లు చేసిన జాప్యం మిగిలిన విద్యార్ధుల సమానత్వాన్ని దెబ్బతీస్తుందని పేర్కొంది. స్థానిక కోటా ప్రవేశాల కోసం పిటిషనర్లు ఇచ్చిన వినతి పత్రాలను పరిశీలించి వాటిపై తగిన నిర్ణయం తీసుకోవాలని కాళోజీ యూనివర్సిటీని ఆదేశించింది. స్థానికత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించింది.

తదుపరి వ్యాసం