తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  40 ఏళ్లు, 14 విజయాల తర్వాత మరోసారి ఓటమి చవిచూసిన కేసీఆర్

40 ఏళ్లు, 14 విజయాల తర్వాత మరోసారి ఓటమి చవిచూసిన కేసీఆర్

HT Telugu Desk HT Telugu

04 December 2023, 9:25 IST

    • మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన రాజకీయ జీవితంలో 40 సంవత్సరాల తర్వాత, 14 విజయాల తర్వాత తోలి సారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుండి పోటీ చేసిన, కేసీఆర్, కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కే వెంకటరమణ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (ANI)

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన రాజకీయ జీవితంలో 40 సంవత్సరాల తర్వాత, 14 విజయాల తర్వాత తోలి సారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారి 1983 లో సిద్ధిపేట నియోజకవర్గం నుండి తొలిసారి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా పోటీచేసిన కె.చంద్రశేఖర్ రావు, తన రాజకీయ గురువు కాంగ్రెస్ అభ్యర్థి అనంతుల మధుసూదన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1985 లో జరిగిన ఎన్నికలలో మరలా టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి, కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ ను ఓడించి సిద్ధిపేట ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందారు. 

ట్రెండింగ్ వార్తలు

Hyderabadi In UK Polls: యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో సిద్ధిపేట ఐటీ ఇంజనీర్‌, లేబర్ పార్టీ తరపున పోటీ

Graduate Mlc Election: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై బీజేపీ గురి, కీలక నేతలకు ఇన్‌ఛార్జి బాధ్యతలు

Warangal Rains: వరంగల్‌లో ఈదురు గాలులతో భారీ వర్షం, రైతులకు తీవ్ర నష్టం.. గ్రేటర్ లో ఆఫీసర్లు అలర్ట్

CM Revanth Reddy : తెలంగాణలో భూముల మార్కెట్ విలువ సవరణ…! కీలక ఆదేశాలు జారీ

అదేవిధంగా 1989, 1994, 1999 లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 1999 ఎన్నికల్లో గెలిచిన తర్వాత, తెలంగాణ కోసం గొంతెత్తిన కేసీఆర్, 2001లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ని స్థాపించారు. 2001లో సిద్దిపేట ఉపఎన్నికలో ఐదోసారి ఎమ్మెల్యే గా పోటీచేశారు. 

2004లో సిద్దిపేట నుండి ఎమ్మెల్యే గా , కరీంనగర్ నుండి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. లోక్ సభలో, తెలంగాణ తరపున తన వాయిస్ వినిపించాలని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 2006, 2008లో కరీంనగర్ లోక్ సభ స్థానానికి రాజీనామా చేసి ఉపఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. 

తర్వాత, 2009 లో మహబూబ్ నగర్ నుండి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో గజ్వేల్ నుండి ఎమ్మెల్యేగా, మెదక్ లోక్ సభ స్థానం నుండి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. 

అయితే టిఆర్ఎస్ పార్టీ కి పూర్తీ మెజారిటీ రావటంతో, ఎంపీగా రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2018లో మరొకసారి గజ్వేల్ నుండి ఎమ్మెల్యే గా పోటీచేసి గెలుపొందారు. 

తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుండి, గజ్వేల్ నుండి ఎమ్మెల్యేగా పోటీచేశారు. తన రాజకీయ జీవితంలో 40 సంవత్సరాల తరవాత తొలిసారి కామారెడ్డి లో ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యారు. అయితే గజ్వేల్ నుండి వరుసగా మూడోసారి గెలుపొందారు. 

కేసీఆర్ తొమ్మిది సార్లు ఎమ్మెల్యే గా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరు కూడా అన్నిసార్లు ఎమ్మెల్యే గా గెలుపొందలేదు. కేసీఆర్ ఎమ్మెల్యే గా 9 సార్లు, ఎంపీ గా 5 సార్లు గెలిపొందారు. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో కెసిఆర్ రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా, కేంద్ర మంత్రిగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

తదుపరి వ్యాసం