తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kaleshwaram Project : కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు - అసలేం జరిగింది..?

Kaleshwaram Project : కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు - అసలేం జరిగింది..?

22 October 2023, 6:53 IST

    • Medigadda Bridge Pillars Sagged: తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ వంతెన కొంతమేర కుంగింది. బ్యారేజీలోని బీ బ్లాక్ పరిధిలో గల 18,19, 20, 21 పిల్లర్ల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
లక్ష్మీబ్యారేజ్
లక్ష్మీబ్యారేజ్ (Twitter)

లక్ష్మీబ్యారేజ్

Kaleshwaram Project News: అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మహదేవపూర్‌ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ వంతెన కుంగిపోయింది. శనివారం రాత్రి బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన కొంతమేర కుంగిపోయినట్లు తెలిసింది. బ్యారేజీ 20వ పిల్లర్‌ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు… మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య బ్యారేజీ పైనుంచి రాకపోకలు నిలిపివేశారు. బ్యారేజీ సమీప ప్రాంతంలోకి ప్రజలను రాకుండా పూర్తిగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పరిచారు.

ట్రెండింగ్ వార్తలు

Hyd Bike Blast: హైదరాబాద్‌లో ఘోరం, బైక్‌‌లో మంటలు ఆర్పుతుండగా భారీ పేలుడు, పలువురికి తీవ్ర గాయాలు

Electrocution : ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ షాక్ కు గురై నలుగురు దుర్మరణం

IRCTC Tamilnadu Tour Package : 6 రోజుల్లో తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

Medak Crime News : దారుణం.. బెట్టింగ్‌ ఆడుతున్నాడని కుమారుడిని రాడుతో కొట్టి చంపిన తండ్రి

అసలేం జరిగింది..?

శనివారం సాయంత్రం తర్వాత ప్రాజెక్ట్ పరిధిలో భారీ శబ్దం వినిపించింది. పేలుడు శ‌బ్దం పెద్ద‌గానే రావ‌డ‌తో ఏం జ‌రిగిందోన‌ని అప్రమత్తం అయ్యారు అధికారులు. అనంత‌రం అక్క‌డ‌కు వెళ్లి చూడ‌గా.. 6వ బ్లాక్‌లోని 20వ ఫిల్ల‌ర్ కొంతమేర కుంగిన‌ట్లు గుర్తించారు. రాత్రి చీకటిపడటంతో… ఏం జరిగిందన్న విషయాన్న అధికారులు స్పష్టంగా గుర్తించలేకపోయారు. వెంటనే బ్యారేజీపై రాకపోకలను నిలిపివేశారు. అయితే బ్యారేజీ 20వ పిల్లర్‌ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు అంచనా వేస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా…. నాలుగేళ్ల క్రితం ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తి చేసుకుంది. దీనిని రివర్స్ పంపింగ్ విధానం ద్వారా నీటిని ఎత్తిపోయడానికి డిజైన్ చేశారు. గోదావరి నదిలోని నీటిని తాగునీరు, నీటి పారుదల కోసం ఉపయోగించుకోవడమే మేడిగడ్డ ప్రధాన లక్ష్యం. లక్ష్మీ బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా…. మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. తాజా ఘటనతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

మరోవైపు ఈ ప్రమాదంపై ఇరిగేషన్ శాఖ అధికారులు… పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వంతెన కుంగటంపై ఎల్‌అండ్‌టీ గుత్తేదారు సంస్థ నిపుణులు కూడా ఏం జరిగిందనే దానిపై ఆరా తీసేందుకు రంగంలోకి దిగినట్లు సమాచారం.

తదుపరి వ్యాసం