తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Goa Tour : గోవా చూసొద్దామా..! హైదరాబాద్ నుంచి కొత్త టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

IRCTC Goa Tour : గోవా చూసొద్దామా..! హైదరాబాద్ నుంచి కొత్త టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

06 September 2023, 14:28 IST

    • IRCTC Hyderabad - Goa Tour : గోవాకి కొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ వివరాలు ఇక్కడ చూడండి….
గోవా టూర్
గోవా టూర్ (IRCTC Tourism)

గోవా టూర్

IRCTC Tourism Goa Retreat Tour: వేర్వురు కొత్త ప్రదేశాలను దర్శించుకునేందుకు ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా గోవాలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘GOA RETREAT’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. దీన్ని హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ చూస్తే ప్రస్తుతం అక్టోబర్ 12, 2023వ తేదీన అందుబాటులో ఉంది. 4 రోజులు, 3 రాత్రుల ప్యాకేజీ ఇది.

ట్రెండింగ్ వార్తలు

TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ హాల్ టికెట్లు విడుద‌ల‌ - డౌన్లోడ్ లింక్ ఇదే

Hyderabad Crime : బీమా డబ్బుల కోసం కోడలి దాష్టీకం..! అత్తమామల హత్యకు కుట్ర, కత్తులతో దాడి చేసిన సుఫారీ గ్యాంగ్

BRS Mlc Election Burden: బీఆర్​ఎస్ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ భారమంతా ‘పల్లా’పైనే! సహకరించని గులాబీ​ నేతలు

Warangal Naimnagar Bridge : నయీంనగర్ బ్రిడ్జి పనుల పూర్తికి టైమ్ ఫిక్స్ - జూన్​ 15 డెడ్ లైన్​..!

ఫస్ట్ డే మధ్యాహ్నం హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరుతారు. 2 గంటలకు గోవా ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ్నుంచి హోటల్ కు బయల్దేరుతారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు.

రెండో రోజు బ్రేక్ ఫాస్ తర్వాత.. సౌత్ గోవాకు వెళ్తారు. ఓల్డ్ గోవా చర్చ ను సందర్శిస్తారు. వాక్స్ వరల్డ్ మ్యూజియం, శ్రీ మంగేశ్ టెంపుల్, మీర్మర్ బీచ్ తో పాటు బోట్ క్రూజర్ లో జర్నీ చేస్తారు. రాత్రి సౌత్ గోవాలోనే బస చేస్తారు.

ఇక మూడో రోజు నార్త్ గోవాలో పర్యటిస్తారు. కండోలియం బీచ్, బాగా బీచ్ కు వెళ్తారు. చపోరా ఫోర్ట్ ను కూడా సందర్శిస్తారు. ఆ తర్వాత హోటల్ కు వస్తారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. 02.30 గంటలకు గోవా ఎయిర్ పోర్టు నుంచి జర్నీ ఉంటుంది. మధ్యాహ్నం 03.55 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోవటంతో జర్నీ ముగుస్తుంది.

గోవా టూర్ ధరల వివరాలు :

ఈ గోవా రీట్రీట్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు రూ. 27,560 ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 21930గా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.21805గా ఉంది. కంఫార్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. టూర్ ప్యాకేజీని బుక్ కూడా చేసుకోవచ్చు. ఇతర సందేహాలు ఉంటే 040-27702407 / 9701360701 ఫోన్ నెంబర్లను కూడా సంప్రదించవచ్చు.

తదుపరి వ్యాసం