తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Madhya Pradesh Tour: 11 వేల ధరలో మధ్యప్రదేశ్ ట్రిప్.. ఈ ప్యాకేజీపై ఓ లుక్కేయండి

IRCTC Madhya Pradesh Tour: 11 వేల ధరలో మధ్యప్రదేశ్ ట్రిప్.. ఈ ప్యాకేజీపై ఓ లుక్కేయండి

HT Telugu Desk HT Telugu

24 February 2023, 8:47 IST

    • Hyderabad - Madhya Pradesh Tour: మధ్యప్రదేశ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా...? అక్కడి పర్యాట ప్రాంతాలను చూడాలనుకుంటే... మీకోసం సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన ధరలతో పాటు తేదీలను కూడా ప్రకటించింది.
మధ్యప్రదేశ్ టూర్
మధ్యప్రదేశ్ టూర్ (facebook)

మధ్యప్రదేశ్ టూర్

IRCTC Tourism Madhyapradesh Tour: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో అధ్యాత్మిక ప్రాంతాలతో పాటు చక్కని పర్యాటక ప్రాంతాలు ఉంటున్నాయి. ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు ఇలా చాలా ప్రాంతాలకు ప్యాకేజీలను ప్రకటిస్తోంది. తాజాగా హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'HERITAGE OF MADHYA PRADESH ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో గ్వాలియర్, ఖజురహో, ఓర్చా వంటి ప్రాంతాలను చూపిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

Wardhannapet Govt Hospital : వర్ధన్నపేటలో దారుణం-ఫోన్లో డాక్టర్ డైరెక్షన్ గర్భిణీకి నర్సులు డెలివరీ, శిశువు మృతి

hyderabad madhya pradesh tour: 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ మార్చి 3వ తేదీన అందుబాటులో ఉంటుంది. ప్రతి శుక్రవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. ఈ షెడ్యూల్ చూస్తే.....

Day 1- Friday: సాయంత్రం 4.40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరుతారు. రాత్రి అంతా జర్నీ ఉంటుంది.

Day 2- Saturday: మధ్యాహ్నం 01.30 గంటలకు గ్వాలియర్ కు చేరుకుంటారు. యోగిని ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం హెటల్ లోకి చెకిన్ అవుతారు. రాత్రి గ్వాలియర్ లోనే ఉంటారు.

Day 3- Sunday: ఉదయమే గ్వాలియర్ ఫోర్ట్ ను సందర్శిస్తారు. హోటల్ నుంచి 10 గంటలకు చెక్ అవుట్ అవుతారు. అనంతరం జై విలాస్ ప్యాలెస్ ను సందర్శిస్తారు. అక్కడ్నుంచి ఓర్చాకు వెళ్తారు. ఓర్చా ఫోర్ట్ ను సందర్శించిన తర్వాత.. ఖజరహో కు బయల్దేరుతారు. రాత్రి ఖజరహోలోనే బస చేస్తారు.

Day 4- Monday: ఖజరహోలో స్థానికంగా ఉన్న ఆలయాలను దర్శించుకుంటారు. సాయంత్రం లైటింగ్ అండ్ సౌండ్ షోను చూస్తారు. రాత్రికి ఖజరహోలోనే స్టే చేస్తారు.

Day 5- Tuesday: హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత...రానేశ్ వాటర్ ఫాల్స్ చూస్తారు. సాయంత్రం సత్నాకు బయల్దేరుతారు. రైల్వే స్టేషన్ నుంచి 11.25 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి అంతా జర్నీలోనే ఉంటారు.

Day 6- Wednesday: రాత్రి 09.30 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టికెట్ రేట్లు....

hyd madhyapradesh tour cost: మధ్యప్రదేశ్ టూర్ ట్రిప్ ధరలు చూస్తే.... సింగిల్ షేరింగ్ కు రూ. 31790ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 18,130 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.14,310గా ఉంది. కంఫర్ట్ 3AC కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో వేర్వురు ధరలు ఉన్నాయి. ఇక 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.

టికెట్ ధరలు

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం