తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Hyd Goa Tour: 'డిలైట్ గోవా' ట్రిప్.. ఈ ఐఆర్‌సీటీసీ ప్యాకేజీని చూడండి…

IRCTC Hyd Goa Tour: 'డిలైట్ గోవా' ట్రిప్.. ఈ ఐఆర్‌సీటీసీ ప్యాకేజీని చూడండి…

HT Telugu Desk HT Telugu

13 October 2022, 12:02 IST

    • hyderabad delight goa tour package:హైదరాబాద్ నుంచి గోవా టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన తాజా వివరాలను వెల్లడించింది.
హైదరాబాద్ గోవా టూర్ ప్యాకేజీ
హైదరాబాద్ గోవా టూర్ ప్యాకేజీ (HT)

హైదరాబాద్ గోవా టూర్ ప్యాకేజీ

irctc tourism goa tour from hyd: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి గోవాలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. GOAN DELIGHT పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఫ్లైట్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది.

ట్రెండింగ్ వార్తలు

Electrocution : ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ షాక్ కు గురై నలుగురు దుర్మరణం

IRCTC Tamilnadu Tour Package : 6 రోజుల్లో తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

Medak Crime News : దారుణం.. బెట్టింగ్‌ ఆడుతున్నాడని కుమారుడిని రాడుతో కొట్టి చంపిన తండ్రి

TS EAPCET 2024 Key : తెలంగాణ ఎంసెట్ అప్డేట్స్ - ఇంజినీరింగ్ స్ట్రీమ్ 'కీ' కూడా వచ్చేసింది, ఇదిగో డైరెక్ట్ లింక్

hyderabad goa tour: నవంబర్ 24వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. 3 రాత్రులు 4 రోజుల టూర్ ప్యాకేజీ. ఇది AIR PACKAGE భాగంగా అందిస్తున్నారు.

Day 01: మొదటిరోజు సాయంత్రం 04.20 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి జర్నీ మొదలవుతుంది. సాయంత్రం 05.35 నిమిషాలకు గోవా విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ్నుంచి హోటల్ లోకి చెకిన్ అవుతారు. తర్వాత జురారీ నదికి వెళ్తారు. తిరిగి హోటల్ కి చేరుకుంటారు.

Day 02: South Goa

బ్రేక్ ఫాస్ట్ తర్వాత సౌత్ గోవాలోని పలు ప్రాంతాల సందర్శన ఉంటుంది. ఓల్డ్ చర్చ్, వాక్స్ వరల్డ్ మ్యూజియం, శ్రీ మంగేషీ ఆలయం, మిరామిర్ బీచ్ కు వెళ్తారు. క్రూజ్ బోట్ లో జర్నీ ఉంటుంది. తర్వాత తిరిగి హోటల్ కి చేరుకుంటారు.

Day 03: North Goa

అల్పహారం తర్వాత నార్త్ గోవా టూర్ కు వెళ్తారు. Aguada ఫోర్టు, కండోలియం బీచ్, బాగా బీచ్ లో స్పోర్ట్ ఈవెంట్స్ లో పాల్గొంటారు. అంజునా బీచ్, వగాటర్ బీట్, చాపోరా బీచ్ సందర్శన తర్వాత తిరిగి హోటల్ కి వెళ్తారు.

Day 04: Goa- Hyd

బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి ఉదయం 11 గంటలకు చెక్ అవుట్ అవుతారు. తర్వాత గోవా విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 02.15 నిమిషాలకు జర్నీ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 03.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ధరలివే.....

hyd goa tour cost: సింగిల్ షేరింగ్ కు రూ. 27,300 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 21,455 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.20,980గా ఉంది. కంఫార్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి.

<p>ధరల వివరాలు</p>

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం