తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Kashmir Tour 2024 : సమ్మర్ లో 'కశ్మీర్' ట్రిప్... హైదరాబాద్ నుంచి బడ్జెట్ ధరలో ఫ్లైట్ టూర్ ప్యాకేజీ - వివరాలివే

IRCTC Kashmir Tour 2024 : సమ్మర్ లో 'కశ్మీర్' ట్రిప్... హైదరాబాద్ నుంచి బడ్జెట్ ధరలో ఫ్లైట్ టూర్ ప్యాకేజీ - వివరాలివే

16 February 2024, 16:18 IST

    • Irctc Tourism Hyderabad Kashmir Tour 2024:  హైదరాబాద్ నుంచి కశ్మీర్ కు స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం.  ఇందుకు సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి…..
కశ్మీర్ టూర్ ప్యాకేజీ
కశ్మీర్ టూర్ ప్యాకేజీ

కశ్మీర్ టూర్ ప్యాకేజీ

IRCTC Tourism Hyderabad Kashmir Tour 2024: సమ్మర్ ఎంట్రీ ఇచ్చేసింది. ఎండలు గట్టిగానే కొడుతున్నాయి. ఈ సమ్మర్ లో ఏదైనా చల్లని ప్రాంతానికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా…? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్‌సీటీసీ టూరిజం. 'మిMYSTICAL KASHMIR EX HYDERABAD' పేరుతో సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏప్రిల్ 12,2024వ తేదీన ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఆరు రోజుల పాటు టూర్ ఉంటుంది. గుల్మార్గ్, శ్రీనగర్, సోన్‌మార్గ్, పహల్ గామ్ ప్రాంతాలు కూడా ఇందులో కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీలో హౌజ్ బోట్‌లో బస చేసే అవకాశం దొరకటం మరో స్పెషల్.

ట్రెండింగ్ వార్తలు

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

ఫస్ట్ డే హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు ఫ్లైట్ జర్నీ ద్వారా స్టార్ట్ అవుతారు. సాయంత్రం సమయానికి శ్రీనగర్ కు చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత… పలు ప్రాంతాలను చూస్తారు. దాల్ సరస్సు అందాలను వీక్షిస్తారు. ఆ తర్వాతి రోజుల్లో సోన్ మార్గ్, గుల్మార్గ్ ప్రాంతాలను సందర్శిస్తారు. చివరిగా పహల్మాగ్ కు వెళ్తారు. ఆరో రోజు శ్రీనగర్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరి హైదరాబాద్ చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టికెట్ ధరలు - బుకింగ్ ప్రాసెస్

https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. ఇందులో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. ధరలు చూస్తే కంఫార్ట్ క్లాస్ లో సింగిల్ అక్యుపెన్సీకి 58,565గా నిర్ణయించారు. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 51,300గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 52930గా ఉంది. చిన్న పిల్లలకు వేర్వురు ధరలను నిర్ణయించారు.

మరోవైపు హైదరాబాద్ నుంచి షిర్డీ టూర్ ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్ సీటీసీ టూరిజం. 'SAI SANNIDHI EX HYDERABAD' అనే పేరుతో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఫిబ్రవరి 21, 2024వ తేదీన అందుబాటులో ఉంది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతి బుధవారం ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.

-ఫస్ట్ డే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (అజంతా ఎక్స్ ప్రెస్) నుంచి సాయంత్రం 06.50 నిమిషాలకు బయల్దేరుతారు. రాత్రంతా జర్నీ ఉంటుంది.

-రెండో రోజు ఉదయం 07.10 నిమిషాలకు నాగర్ సోల్ రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి షిర్డీకి వెళ్తారు. హెటల్ లోకి చెకిన్ అవుతారు. అనంతరం షిర్డీ ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. ఆ తర్వాత శని శిగ్నాపూర్ కు వెళ్తారు. అక్కడ్నుంటి నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు బయల్దేరుతారు. రాత్రి 08 .30 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.

-మూడో రోజు ఉదయం 08.50 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

షిర్డీ టూర్ టికెట్ ధరలు:

Hyderabad Shirdi Tour Prices 2024: హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ షిర్డీ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు రూ. 7790 గా ఉండగా… డబుల్ షేరింగ్ కు రూ. 6560 ధరగా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6550గా ఉంది. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 4910గా ఉంది. గతేడాది డిసెంబర్ లో ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ. 8,680 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ.7,010ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు 6,840గా నిర్ణయించారు. కంఫార్ట్ క్లాస్ల్ కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. గతంలో ఉన్న ధరలతో పోల్చితే… ప్రస్తుతం ధరలు తగ్గాయి. ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కవర్ అవుతాయి. నిబంధనలు కూడా వర్తిస్తాయి. పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన జాబితాను చూడండి. https://www.irctctourism.com/ క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం