తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kumari Aunty Food Stall : కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ క్లోజ్, కేసు నమోదు చేసిన పోలీసులు!

Kumari Aunty Food Stall : కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ క్లోజ్, కేసు నమోదు చేసిన పోలీసులు!

30 January 2024, 23:24 IST

    • Kumari Aunty Food Stall : హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న కుమారీ ఆంటీపై కేసు నమోదైంది. ఆమె ఫుడ్ స్టాల్ ను పోలీసులు అడ్డుకున్నారు. ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్నారని పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కుమారీ ఆంటీ
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కుమారీ ఆంటీ

స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కుమారీ ఆంటీ

Kumari Aunty Food Stall : హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి వద్ద స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తూ జీవనం సాగిస్తున్న కుమారీ ఆంటీ... సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఫేమస్ అయ్యింది. యూట్యూబ్ వీడియోలు, ఇన్ స్టా రీల్స్ కుమారీ ఆంటీ వైరల్ అయ్యింది. దీంతో ఆమె ఫుడ్ స్టాల్ వద్ద రద్దీ అమాంతం పెరిగింది. యూట్యూబ్ వీడియోస్ తో కస్టమర్స్ కూడా బాగా పెరిగాయి. ఆమె మాట్లాడిన రెండు లివర్లు వెయ్యి రూపాయిలు అనే డైలాగ్ నెట్టింట వైరల్ అయ్యింది. ఇక యూట్యూబ్ ఛానల్స్ కుమారీ ఆంటీ వీడియోస్ కోసం క్యూకట్టారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడంతో యువత కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ కు పోటెత్తారు. ఆ పాపులారిటీనే ఆమెకు కష్టాలు తెచ్చిపెట్టాయి. కుమారీ ఆంటీ వద్ద భోజనానికి కస్టమర్లు పోటీ పడడంతో రద్దీ భారీగా పెరిగింది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి, కుమారీ ఆంటీపై కేసు నమోదు చేశారు. ఇలా రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని షాపు మూసివేయాలని కోరారు. దీంతో కొద్దిసేపు పోలీసులు, కుమారీ ఆంటీ మధ్య వాగ్వాదం జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

Kakatiya University VC : కేయూ వీసీపై విజిలెన్స్ విచారణ - సర్కార్ ఆదేశాలు

TS SET 2024 Updates : తెలంగాణ సెట్ దరఖాస్తులు ప్రారంభం - ఆగస్టు 28 నుంచి పరీక్షలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

ట్రాఫిక్ జామ్ సమస్య

ఫుడ్ స్టాల్ పెట్టుకుని తన వ్యాపారం తాను చేసుకుంటుంటే... వీడియోస్ అంటూ ఆమెను బద్నాం చేయడం సరికాదని నెటిజన్లు స్పందిస్తున్నారు. సోషల్ మీడియా పేరుతో ఆమెను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలతో అక్కడ ఫుడ్ స్టాల్ పెట్టొద్దని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. అసలు ఆ ప్లేస్ లో ఫుడ్ స్టాల్ పెట్టేందుకు అనుమతులు లేవన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు ఉన్న ఆస్తి ఏపీలో ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలం మాత్రమేనన్నారు. ఈ వీడియోను వైసీపీ అభిమానులు వైరల్ చేశారు. తాజాగా ఆమె స్టాల్ క్లోజ్ చేయడంపై రాజకీయ రంగు పులుముకుంది. సీఎం జగన్ గురించి చెప్పడంతో... టీడీపీ, జనసేన తమకు అనుకూలమైన తెలంగాణ ప్రభుత్వంతో కుమారీ ఆంటీ స్టాల్ క్లోజ్ చేయించారని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ విషయంపై వైసీపీ, జనసేన మధ్య సామాజిక మాధ్యమాల్లో వార్ నుడుస్తోంది. కష్టకాలంలో ఆమెకు అండగా నిలవకుండా వైసీపీ దుష్ప్రచారానికి దిగిందని జనసేన ఆరోపిస్తుంది.

ఫుడ్ స్టాల్ మూసివేత

ఇటీవల ఊరి పేరు భైరవ కోన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో సందీప్ కిషన్- వర్షా బొల్లమ్మ కూడా కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద ప్రచారం చేసి ఆమె చేతివంటి రుచి చూశారు. దీంతో కుమారీ ఆంటీ ఫుడ్ కు మరింత గిరాకీ పెరిగింది. గిరాకీ పెరగడంతో ఆ మార్గంలో వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో కుమారీ ఆంటీ ఫుడ్ ట్రక్కును పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ వ్యాపారం చేయడానికి వీల్లేదని, ఈ ఫుడ్ స్టాల్ వల్ల ట్రాఫిక్ బ్లాక్ అవుతోందని తెలిపారు. అంతేకాకుండా కుమారీ ఆంటీ ఫుడ్ ట్రక్కును కూడా సీజ్ చేశారు. దీంతో కాసేపు కుమారీ ఆంటీ కుటుంబానికి, పోలీసులకు మధ్య గొడవ జరిగింది. పోలీసులు తనపై చేయి చేసుకున్నారని కుమారీ ఆంటీ కొడుకు ఆరోపించారు. తనకు ఇంత పేరు రావడానికి మీడియానే కారణమని, ఈ కష్టకాలంలో తనకు మీడియానే న్యాయం చేయాలని కుమారీ ఆంటీ వేడుకున్నారు. తనకు న్యాయం చేయాలని అన్నారు. పక్కనున్న స్టాల్ ను తొలగించకుండా తన ఫుడ్ స్టాల్ మాత్రమే మూసివేశారని ఆమె ఆరోపించారు.

తదుపరి వ్యాసం