తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Bharat Bhavan : బీఆర్ఎస్ భారత్ భవన్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన, 11 ఎకరాల్లో 15 అంతస్తుల్లో భారీ భవనం నిర్మాణం

BRS Bharat Bhavan : బీఆర్ఎస్ భారత్ భవన్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన, 11 ఎకరాల్లో 15 అంతస్తుల్లో భారీ భవనం నిర్మాణం

05 June 2023, 15:31 IST

    • BRS Bharat Bhavan : భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కోకాపేటలో 11 ఎకారల విస్తీర్ణంలో 15 అంతస్తుల్లో ఈ భవనాన్ని నిర్శిస్తున్నారు.
బీఆర్ఎస్ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన
బీఆర్ఎస్ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన

బీఆర్ఎస్ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన

BRS Bharat Bhavan : బీఆర్ఎస్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ అండ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ భవనానికి సీఎం కేసీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌ కోకాపేటలో 11 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్తుల్లో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ఈ భారీ భవనానికి సీఎం కేసీఆర్ భూమిపూజ నిర్వహించారు. పార్టీ నేతలకు శిక్షణ, ఇతర కార్యకలాపాల కోసం బీఆర్ఎస్ భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చండీ హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, మల్లారెడ్డి, పలువురు ఎంపీలు, స్థానిక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యాధునిక సాంకేతికతతో భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ పేర్కొంది.

మొత్తం 15 అంతస్తుల్లో

దేశ రాజధాని దిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. వివిధ రాష్ట్రాల్లో పార్టీ ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నట్లు బీఆర్‌ఎస్‌ నేతలు తెలిపారు. హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతిక హంగులతో పార్టీ నేతలకు శిక్షణ, పార్టీ వ్యవహారాల కోసం మరో భారీ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ భవనంలో రాజకీయపరమైన అవగాహన కార్యక్రమాలు, శిక్షణా తరగతుల నిర్వహణ, కార్యకర్తలు, నాయకులకు అవసరమైన సమగ్రమైన సమాచారం లభించే కేంద్రంగా భారత్‌ భవన్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని నిర్మిస్తున్నామని బీఆర్ఎస్ వెల్లడించింది. మొత్తం 15 అంతస్థుల్లో భవనాన్ని నిర్మించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ కార్యకర్తలకు సమగ్ర శిక్షణా కేంద్రంగా, దేశంలోని ఏ ప్రాంతం వారు వచ్చినా పూర్తి సమాచారం లభించేలా, పార్టీ కార్యకర్తలకు సమగ్ర శిక్షణ ఇచ్చే కేంద్రంగా భారత్ భవన్ ను తీర్చిదిద్దనున్నట్లు నేతలు పేర్కొన్నారు.

నిపుణులతో శిక్షణ

ఈ భవనంలో భారీ సమావేశ మందిరాలు, డిజిటల్‌ లైబ్రరీ, వివిధ భాషాల పత్రికలు, వార్తల సమాచారాన్ని క్రోడీకరించడం, పార్టీ నేతలకు అవసరమైన సమాచారాన్ని అందించడం, రాష్ట్రాల వారీగా, రంగాల వారీగా వివరాలను సేకరణ, వాటిని క్రోడీకరించి నేతలకు అందుబాటులో ఉంచనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇక్కడే శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన గదులు, సమావేశ మందిరాలను ఏర్పాటు చేయనున్నారు. శిక్షణకు వచ్చే వారి కోసం అవసరమైన వసతి కూడా ఏర్పాటు చేయనున్నారు. అత్యంత పేరున్న సంస్థల్లో పనిచేసిన కొందరు సీనియర్లతో బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలకు శిక్షణ ఇవ్వనున్నారు. రిటైర్డ్‌ అధికారులు, న్యాయ నిపుణులు, పలు రంగాల్లో సీనియర్లు, రాజకీయ రంగంపై అవగాహన ఉన్న వారిని సమన్వయ కర్తలు, సబ్జెక్ట్‌ నిపుణులుగా నియమించున్నారు.

తదుపరి వ్యాసం